Kalaavathi Song : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం.. సర్కారు వారి పాట. ఈ సినిమాలోంచి ఫస్ట్ సింగిల్‌ను ఈ మధ్యే విడుదల చేశారు. కళావతి పేరిట విడుదలైన ఈ సాంగ్ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపుతోంది. యూట్యూబ్‌లో ఈ పాట ట్రెండ్ అవుతోంది. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో శ్రీవల్లి స్టెప్‌లా కళావతి స్టెప్ పేరుగాంచింది. దీంతో ఈ స్టెప్‌ను చాలా మంది వేస్తూ తమ సరదా తీర్చుకుంటున్నారు.
మహేష్ బాబు కుమార్తె సితార ఈ మధ్యే కళావతి స్టెప్‌ను వేసి ఆకట్టుకుంది. ఇక తాజాగా ఆయన సోదరి మంజుల.. కళావతి స్టెప్‌ను వేసింది. మహేష్ ఆ పాటకు ఎలాగైతే స్టెప్ వేసి అలరించారో.. అదేవిధంగా ఆయన సోదరి కూడా స్టెప్ వేయడం విశేషం. ఇప్పటికే ఈ పాటకు ఎంతో మంది డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఇక మంజుల చేసిన డ్యాన్స్ వీడియో కూడా ఆకట్టుకుంటోంది. ఈ వీడియో వైరల్ గా మారింది.
View this post on Instagram
సర్కారు వారి పాట చిత్రానికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించగా.. ఇంకా కొన్ని సీన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ మూవీని మే11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.