Dhanush Aishwarya Rajinikanth : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌లు ఇటీవలే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సమంత, నాగచైతన్యల విడాకుల విషయం ఎంతటి సంచలనం కలిగించిందో.. వీరి విడాకుల వార్త కూడా అంతే సెన్సేషనల్ అయింది. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ తన అల్లుడు, కుమార్తెను కలుపుతారని భావించారు. కానీ ఆయన ఎంత చెప్పినా ధనుష్ వినలేదని వార్తలు వచ్చాయి. అయితే ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌లు తాజాగా ఓ పార్టీలో ఎదురెదురుగా వచ్చారు. దీంతో వీరు కలుస్తారేమోనని అందరూ ఆశించారు.
ఇటీవలే ఓ కామన్ ఫ్రెండ్ ఇచ్చిన పార్టీకి ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌లు హాజరయ్యారు. వీరు ఒకరికొకరు ఎదురు పడ్డారట కూడా. కానీ పలకరించుకోలేదట. కనీసం ఒకరినొకరు చూసుకోలేదట. దీంతో వీరు కలుస్తారని ఆశించిన కామన్ ఫ్రెండ్స్ నిరాశకు గురయ్యారట. ఇక వీరు అసలు కలవరు.. అనే నిర్దారణకు వచ్చారట. ఈ క్రమంలోనే వీరి విడాకులు ఇక కన్‌ఫామ్ అయినట్లేనని అంటున్నారు.
అయితే ఓ సినిమా షూటింగ్ కోసం ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ హైదరాబాద్‌కు వచ్చి ఒకే హోటల్‌లో ఉన్నారట. కానీ ఇద్దరూ ఒకరినొకరు చూసుకోలేదట. ఈ క్రమంలోనే ఈ జంట ఇక ఎంత మాత్రం కలవరని.. అది కష్టమేనని అంటున్నారు. వీరు కలుస్తారని ఆశించిన వారు తీవ్ర నిరాశకు గురయ్యారట.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ధనుష్ ప్రస్తుతం మారన్ అనే చిత్రంలో నటించారు. ఈ మూవీ తమిళంతోపాటు తెలుగులోనూ విడుదలవుతోంది. ఇందులో ధనుష్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా కనిపించారు. ఈ సినిమా ఈ నెల 11వ తేదీన అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా రిలీజ్ కానుంది. అలాగే సర్ అనే తెలుగు సినిమాలో ధనుష్ నటిస్తున్నారు. దీనికి వెంకీ అట్లూరి దర్శకుడు కాగా.. శేఖర్ కమ్ములతో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే ది గ్రే మ్యాన్ అనే ఇంగ్లిష్ మూవీతోపాటు తిరుచిత్రంబలం, నాన్ వరువేన్ అనే తమిళ సినిమాల్లోనూ ధనుష్ నటిస్తున్నారు.