Nayanthara : లేడీ సూపర్‌స్టార్‌గా పేరుగాంచిన నయనతార ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈమధ్యే ఈమె గురించిన ఓ సంచలన వార్త వైరల్ అయింది. ఈమె తన ప్రియుడు విగ్నేష్ శివన్‌ను గతంలో ఎప్పుడో రహస్య వివాహం చేసుకుందని.. అందుకనే ఓ ఆలయానికి వెళ్లినప్పుడు ఆమె నుదుటిపై సింధూరం కూడా ధరించిందని.. వీరు తమ పెళ్లిని దాచి పెట్టారని.. ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై వారు స్పందించలేదు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. అయితే తాజాగా మరో వార్త వైరల్ అవుతోంది. అదేమిటంటే..
నయనతార తన భర్త విగ్నేష్ శివన్‌తో కలిసి సరోగసి పద్ధతిలో పిల్లలను కనాలని అనుకుంటుందని.. సొంతంగా గర్భం ధరిస్తే అందరికీ తెలిసిపోతుందని.. పైగా కెరీర్‌కు ఇబ్బందులు వస్తాయని.. కనుకనే గుట్టుగా పిల్లల్ని కనాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇక ఇప్పటికే నయనతార, విగ్నేష్ శివన్ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. అందులో భాగంగానే ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా ఒకరికొకరు విషెస్ చెప్పుకున్నారు. కాగా సినిమాల విషయానికి వస్తే నయనతార నటించిన కాతు వాకుల రెండు కాదల్ అనే మూవీ ఏప్రిల్‌లో విడుదలవుతోంది. ఇందులో సమంత, విజయ్ సేతుపతిలు ఇతర కీలకపాత్రల్లో నటించారు. ఇక విగ్నేష్ శివన్ దర్శకుడు కనుక ఆయన తరువాతి సినిమాను తమిళ స్టార్ నటుడు అజిత్‌తో కలిసి చేయనున్నారు.