Neem Tree : ఆయుర్వేదం ప్రకారం వేప చెట్టులో అద్భుతమైన ఔషధగుణాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అందుకనే వేప చెట్టుకు చెందిన భాగాలను వివిధ రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఆయుర్వేదంలో ఉపయోగిస్తుంటారు. వేప ఆకులు, పువ్వులు, కాయలు, బెరడు.. అన్నీ మనకు ఉపయోగపడతాయి. వీటితో ఆయుర్వేద ఔషధాలను కూడా తయారు చేస్తుంటారు. అయితే వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా మనకు వేప చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దీంతో శని దోషాన్ని తొలగించుకోవచ్చు. అలాగే శని అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
శని దోషం తొలగిపోవాలంటే ఇంటి ఆవరణలో దక్షిణం లేదా పశ్చిమ దిశలో వేప చెట్టును నాటాలి. దీంతో శని దోషం తొలగిపోతుంది. ఆ ఇంట్లోని వారికి ఉండే అనారోగ్య సమస్యలు పోతాయి. దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయి. శని ప్రభావం మంచిగా ఉంటుంది. కనుక శని సమస్యలను కలగజేయడు. అలాగే పితృ దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి.
ఇక శనిదేవుడి అనుగ్రహం పొందాలంటే వేప చెక్కతో తయారు చేసిన మాలను ధరించాలి. దీంతో శని సంతోషిస్తాడు. మనకు ఆశీర్వాదం అందిస్తాడు. శనిదోషం తొలగిపోతుంది.
ఇక ఆదివారం వేప చెట్టుకు నీళ్లను పోయాలి. దీని వల్ల మన జాతక చక్రంపై శనిదోషం ప్రభావం తగ్గుతుంది. అలాగే వేప చెట్టును పెట్టుకోవడం వల్ల కేతు గ్రహం కూడా మనపై అనుగ్రహం కలిగిస్తాడు. దీంతో కేతు దోషాలు కూడా పోతాయి. ఇలా వేప చెట్టుతో ఒకేసారి రెండు గ్రహ దోషాలను తొలగించుకోవచ్చు. దీంతో ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు పోతాయి. కుటుంబంలో కలహాలు తగ్గుతాయి. విద్య, ఉద్యోగం, వ్యాపారంలో రాణిస్తారు.