Height Increase Foods : మనకు జన్యుపరంగా సంక్రమించే వాటిల్లో ఎత్తు కూడా ఒకటి. మన ఎత్తు అనేది తల్లిదండ్రుల నుండి వంశపారపర్యంగా సంక్రమిస్తుంది. ఒక్కోసారి తల్లిదండ్రులు ఎత్తుగా లేకపోయినప్పటికీ పిల్లలు ఎత్తుగా ఉంటారు. ఒక్కోసారి తల్లిదండ్రులు ఎత్తుగా ఉన్నప్పటికీ పిల్లలు ఎత్తు తక్కువగా ఉంటారు. అలాగే వయసు పెరిగినా ఎత్తు పెరగడం లేదని చింతించడం మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. ఇలా పిల్లలు ఎత్తు పెరగకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. పోషకాహార లోపం కూడా పిల్లలు ఎత్తు పెరగకపోవడానికి ఒక కారణం కావచ్చు.
అదేవిధంగా హార్మోన్లు సరిగ్గా పని చేయకపోవడం కూడా ఎత్తు పెరగకపోవడానికి మరో కారణం కావచ్చు. కారణాలేవైనప్పటికీ ఎత్తు పెరగడం లేదని బాధపడే వారు మనలో చాలా మందే ఉండి ఉంటారు. అలాంటి వారు ఇక ఏ మాత్రం బాధపడకుండా కింద చెప్పే చిట్కాలను పాటించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఎత్తు పెరగవచ్చు. సహజసిద్ధంగా లభించే ఆహారాల్లో బఠాణీలు కూడా ఒకటి. ఈ గింజల్లో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. ఫైబర్, ప్రోటీన్స్, మినరల్స్ వంటివి వీటిలో అధికంగా ఉంటాయి. ఈ బఠాణీ గింజలను తీసుకునే వారు తప్పకుండా ఎత్తు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు.
ఈ గింజలను వాడడం వల్ల వీటిలో ఉండే పోషకాలు వెన్నుముకపై ప్రభావం చూపుతాయని తద్వారా ఎముకలు వ్యాకోచించి ఎత్తు పెరుగుతారని వారు తెలియజేస్తున్నారు. చిన్న పిల్లలు, యుక్తవయస్సు ఉన్న వారు ఈ బఠాణీ గింజలను తీసుకోవడం వల్ల త్వరితగతిన ఎత్తు పెరుగుతారని పరిశోధనల్లో తేలింది. ఈ గింజలను ఉడికించి కూరగా చేసుకుని అన్నంతో కలిపి తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఎత్తు పెరగడానికి ఉపయోగపడే మరికొన్ని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎత్తు పెరగడానికి ఉపయోగపడే మరో సహజసిద్ధ కూరగాయ బెండకాయ. ఇందులో ఉండే పిండి పదార్థాలు, నీరు, ఖనిజాలు ఇతర పోషకాలు ఎత్తు పెరగడంలో అద్భుతంగా పని చేస్తాయి. అలాగే బచ్చలికూర కూడా ఎత్తు పెరగడానికి దివ్యౌషధంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల పిల్లలు, యుక్త వయసు వారు చక్కగా ఎత్తు పెరుగుతారు. అదే విధంగా పాలు, అరటి పండ్లు, సోయా ఉత్పత్తులు కూడా ఎత్తు పెరగడంలో చక్కగా సహకరిస్తాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల త్వరగా ఎత్తు పెరుగుతారని, వీటిలో ఉండే పోషకాలు ఎత్తు పెరగని వారిని కూడా ఆశ్చర్యకరంగా ఎత్తు పెరిగేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎత్తు తక్కువగా ఉన్న వారు పైన తెలిపిన ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఎత్తును సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.