ఆరోగ్యంగా ఉండడం కోసం నిత్యం మనం చాలా అలవాట్లను పాటిస్తుంటాం. ఉదయం లేవగానే యోగా, వ్యాయామం చేస్తుంటాం. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే ఆరోగ్యంగా ఉండేందుకు తులసి నీళ్లు కూడా ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఈ నీళ్లను రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగితే ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక కప్పు నీటిలో నాలుగైదు తులసి ఆకులను వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. అనంతరం వచ్చే నీటిని పరగడుపునే తాగాలి. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.
* తులసి ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. దీంతో శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. శరీరానికి శక్తి లభిస్తుంది.
* తులసి నీళ్లను తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు తగ్గుతాయి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది.
* డయాబెటిస్‌తో బాధపడేవారు ఈ నీటిని తాగితే వారి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
* తులసి నీళ్లు ఆస్తమా, దగ్గు, జలుబు వంటి సమస్యలు ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి. ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
* అధిక బరువు తగ్గాలనుకునేవారు నిత్యం ఈ నీటిని తాగితే ప్రయోజనం ఉంటుంది.
* తులసి నీళ్లను తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్, మలబద్దకం ఉండవు.
* నీరసంగా, నిస్సత్తువగా, అలసటగా ఉండేవారు ఈ నీటిని తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా బద్దకం తగ్గుతుంది.