Weight Loss : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరిని కుంగదీస్తున్న సమస్యల్లో స్థూల కాయం సమస్య ఒకటి. షుగర్, రక్తపోటు, హార్ట్ ఎటాక్ వంటి అనేక అనారోగ్య సమస్యలు మన పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కారణంగా వస్తాయి. ఒకప్పుడు వాకింగ్, డైటింగ్ వంటివి కొద్దిరోజులు చేయగానే బరువు తగ్గేవాలం. కానీ ఇప్పుడు ఏం చేసినా బరువు తగ్గడం లేదని చాలా మంది బాధపడుతున్నారు. ఆహారాన్ని జీర్ణం చేసుకునే శక్తి తక్కువగా ఉండడం, శరీరంలో జీవక్రియరేటు తక్కువగా ఉండడం వంటి వాటిని బరువు తగ్గకపోవడానికి కారణాలుగా చెప్పవచ్చు. మనం తీసుకునే ఆహారంలో కొద్ది ఆహారాన్ని మాత్రమే శరీరం తీసుకుంటుంది. మిగిలిన ఆహారం కొవ్వు రూపంలో శరీరంలో పేరుకుపోతుంది. శరీరానికి తగినంత ఆహారం అందకోవడం వల్ల నీరసంగా ఉండడం, కళ్లు తిరగడం వంటివి జరుగుతాయి.
దీంతో మనం మరింత ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం. ఇలా అధికంగా ఆహారం తీసుకోవడం వల్ల పొట్ట దగ్గర కొవ్వు మరింత పెరుగుతుంది. పొట్ట దగ్గర కొవ్వును కరిగించాలంటే మన శరీరంలో జీవక్రియరేటును పెంచాలి. శరీర జీవక్రియ రేటును మనం చాలా సులభంగా పెంచుకోవచ్చు. జీవక్రియ రేటును పెంచడంలో అల్లం,నిమ్మకాయ మనకు ఎంతగానో సహాయపడతాయి.అల్లం, నిమ్మకాయతో పానీయాన్ని తయారు చేసుకుని తీసుకోవడం వల్ల శరీర జీవక్రియ రేటును పెంచుకోచ్చు. జీవక్రియ రేటును పెంచడంలో అల్లం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రోజూ మనం వంటల్లో ఉపయోగించే అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అంతేకాకుండా దీనిలో యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు, శరీరంలో కొవ్వును కరిగించి బరువును తగ్గించే గుణాలు కూడా అధికంగా ఉన్నాయి.
రోజూ అల్లాన్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల పొట్ట, నడుము దగ్గర పేరుకుపోయిన కొవ్వు సులభంగా కరిగిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే నిమ్మకాయ కూడా జీవక్రియ రేటును పెండచంలో ఎంతో సహాయపడుతుంది. ఇందులో అధికంగా ఉండే విటమిన్ సి కొవ్వును కరిగించడంలో దోహదపడుతుంది. ఐరన్ లోపంతో బాధపడే వారు తొందరగా నీరసించే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడానికి బదులుగా నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకోవడం వలంల తక్షణ శక్తి లభిస్తుంది. నిమ్మలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలు ఎటువంటి వ్యాధులను మన దరిచేరుకుండా చేస్తాయి. నిమ్మకాయ, అల్లంతో పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దీనికోసం ముందుగా ఒక గిన్నెలో నీటిని పోయాలి. తరువాత నిమ్మరసం, అలాగే నిమ్మరసం తీయగా మిగిలిన నిమ్మచెక్కలను ముక్కలుగా చేసి వేయాలి. తరువాత అల్లం ముక్కలను వేసి ఈ నీటిని బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఈ నీటిని రోజుకు రెండు సార్లు తీసుకోవడం వల్ల పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కరగడంతో పాటు అధిక బరువు కూడా తగ్గుతారు. పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోయిన వారు అధిక బరువుతో బాధపడే వారు ఇలా నిమ్మరసం, అల్లంతో పానీయాన్ని తయారు చేసుకుని తీసుకోవడం వల్ల చక్కటి ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.