ప్రపంచంలోనే అత్యధికంగా పనస పండ్లను పండిస్తున్న దేశాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉంది. పనస పండ్లు తియ్యని సువాసనను కలిగి ఉంటాయి. కొందరికి దీని వాసన నచ్చదు. అయినప్పటికీ పనస పండును తినాల్సిందే. ఎందుకంటే ఈ పండు మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలను అందిస్తుంది. పనస పండును తరచూ తినడం వల్ల మనకు అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అవేమిటంటే…
1. మాంసాహారం తినలేని వారు పనస పండును తినవచ్చు. దీన్ని న్యూట్రిషనిస్టులు మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా చెబుతారు. మాంసాహారంలో ఉండే పోషకాలు ఇందులోనూ ఉంటాయి. కనుక మాంసాహారం తినలేని వారికి పనస పండ్లు బాగా ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల అనేక పోషకాలను పొందవచ్చు.
2. పనస పండ్లలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీర నిర్మాణానికి, కండరాల పనితీరుకు ఉపయోగపడతాయి. పనస పండ్లను తరచూ తినడం వల్ల మన శరీరానికి శక్తి బాగా లభిస్తుంది.
3. ఫైబర్, విటమిన్ ఎ, సి, రైబోఫ్లేవిన్, మెగ్నిషియం, పొటాషియం, కాపర్, మాంగనీస్ వంటి పోషకాలతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పనస పండ్లలో ఉంటాయి. ఇవి మనకు పోషణను అందిస్తాయి. అలాగే శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తాయి.
4. పనస పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి శరీరంలో వాపులను తగ్గిస్తాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా చూస్తాయి.
5. పనస పండ్లలో ఉండే కెరోటినాయిడ్లు టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. ఈ పండ్లు తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటాయి. అలాగే వీటిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. అందువల్ల వీటిని తిన్న వెంటనే రక్తంలో షుగర్ లెవల్స్ పెరగవు. కనుక ఈ పండ్లను డయాబెటిస్ ఉన్నవారు కూడా ఎలాంటి భయం లేకుండా తినవచ్చు.
6. హైబీపీ ఉన్న వారికి ఈ పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి. ఈ పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే హైబీపీ తగ్గుతుంది. అలాగే శరీరంలో రక్తనాళాల గోడలపై అధికంగా పడే ఒత్తిడి తగ్గుతుంది. దీంతో రక్త సరఫరా మెరుగుపడుతుంది. అలాగే శరీరంలో ఎక్కువగా చేరే సోడియం వల్ల కలిగే దుష్పరిణామాలు తగ్గుతాయి.
7. అధిక బరువు ఉన్న వారు కూడా పనస పండ్లను ఎలాంటి భయం లేకుండా తినవచ్చు. నిజానికి ఈ పండ్లు తియ్యగా ఉన్నప్పటికీ వీటిలో క్యాలరీలు, కొవ్వు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల అధికబరువు ఉన్నప్పటికీ వీటిని నిరభ్యంతరంగా తినవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365