Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Sorakaya Pulusu : సొర‌కాయ‌ల‌తో పులుసు కూడా పెట్టుకోవ‌చ్చు తెలుసా.. రుచి చూశారంటే విడిచి పెట్ట‌రు..

D by D
January 8, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Sorakaya Pulusu : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో సొర‌కాయ ఒక‌టి. సొర‌కాయ‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. బ‌రువు త‌గ్గ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, శ‌రీరంలో వేడిని త‌గ్గించ‌డంలో సొర‌కాయ మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. సొర‌కాయ‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. పొర‌కాయ‌తో చేసే ఏ వంట‌కమైనా చాలా రుచిగా ఉంటుంది. సొర‌కాయ‌తో మ‌నం పులుసు కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. సొర‌కాయ పులుసు కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. సొర‌కాయ పులుసును ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

సొర‌కాయ పులుసు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చిన్న ముక్క‌లుగా త‌రిగిన సొరకాయ – 1 ( చిన్న‌ది), ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టీ స్పూన్, నీళ్లు – ఒక గ్లాస్, నాన‌బెట్టిన చింత‌పండు – నిమ్మ‌కాయంత‌, పుట్నాల ప‌ప్పు పొడి – 2 టీ స్పూన్స్, బెల్లం – ఒక చిన్న ముక్క‌.

Sorakaya Pulusu recipe in telugu make in this method
Sorakaya Pulusu

తాళింపు ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, క‌చ్చా ప‌చ్చ‌గా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 3, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఇంగువ – పావు టీ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1.

సొర‌కాయ పులుసు త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు ప‌దార్థాల‌న్నీ వేసి బాగా వేయించాలి. త‌రువాత ప‌సుపు, ఉప్పు, సొర‌కాయ ముక్క‌లు, కారం వేసి రెండు నిమిషాల పాటు క‌లుపుతూ వేయించాలి. త‌రువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు కుక్క‌ర్ పై మూత పెట్టి మ‌ధ్య‌స్థ మంట‌పై ఒక విజిల్ వచ్చే వ‌ర‌కు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మూత తీసి త‌గినంత చింత‌పండు ర‌సం, బెల్లం ముక్క‌, పుట్నాల ప‌ప్పు పొడి వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సొర‌కాయ పులుసు త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. సొర‌కాయ‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా పులుసును కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ వంట‌కాన్ని కూడా లొట్ట‌లేసుకుంటూ అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Sorakaya Pulusu
Previous Post

Grapes Juice : ద్రాక్ష పండ్ల జ్యూస్‌ను ఇలా త‌యారు చేయాలి.. రోజూ తాగితే ఎన్నో లాభాలు..

Next Post

Thotakura For Skin Problems : ఎలాంటి చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉన్నా స‌రే.. ఈ ఆకుకూర‌తో మ‌టుమాయం అవుతాయి..

Related Posts

inspiration

చచ్చిన పాము కూడా ఉపయోగమే… గాంధీ చెప్పిన మాట‌..

June 3, 2025
వైద్య విజ్ఞానం

భూమిపై క్యాన్సర్ రాని ఒకే ఒక జంతువు ఏదో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

June 3, 2025
పోష‌కాహారం

ఇప్ప‌టి నుంచి మామిడి పండ్ల‌ను తినే వారు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే.. ఎందుకంటే..?

June 3, 2025
lifestyle

తొడ‌లు లావుగా ఉన్న‌వారు ఇలాంటి దుస్తుల‌ను ధ‌రిస్తే మంచిది..!

June 3, 2025
హెల్త్ టిప్స్

పాదాల వాపులు ఉన్నాయా.. అయితే ఇలా చేయండి చాలు..

June 3, 2025
వైద్య విజ్ఞానం

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే అది డీహైడ్రేష‌న్ అన్న‌మాటే.. ఇలా చేస్తే చాలు..!

June 3, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!