మసాజ్‌కు ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. పలు రకాల నూనెలను ఉపయోగించి శరీరానికి మర్దనా చేసి తరువాత స్నానం చేయాలి. ఇలా వారంలో 1, 2 సార్లు చేసినా చాలు, ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. పంచకర్మ వంటి థెరపీల్లోనూ మసాజ్‌లకు ప్రాధాన్యతను కల్పించారు. అయితే శరీరంతోపాటు పాదాలకు కూడా అప్పుడప్పుడు మసాజ్‌లు చేయాలి. దీని వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరంలోని పలు అవయవాలకు అనుసంధానం అయ్యే నాడులు పాదాల్లో ఉంటాయి. అందువల్ల పాదాలకు మసాజ్ చేస్తే ఆయా అవయవాలు ఉత్తేజం చెందుతాయి. దీంతో అనారోగ్య సమస్యలు నయం అవుతాయి.
1. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు పాదాల చివర్లలో.. అంటే కాలి వేళ్లపై, పాదం వెనుక భాగంలో మర్దనా చేయాలి. దీంతో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ తగ్గుతాయి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. శరీరానికి ఉత్తేజం లభిస్తుంది. నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు.
2. మెనోపాజ్ దశలో సహజంగానే మూడ్ మారుతుంది. అసౌకర్యంగా ఉంటుంది. అలాంటి వారు ఫుట్ మసాజ్ చేసుకోవాలి. పాదాలపై ఆర్క్ ఆకారంలో వంపు తిరిగిన చోట మర్దనా చేయాలి. దీంతో ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
3. మహిళలు గర్భం ధరించి ప్రసవించాక పాదాలు వాపులకు గురవుతుంటాయి. అలాగే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు పాదాలపై మసాజ్ చేయాలి. దీంతో మెటబాలిజం పెరుగుతుంది. పాదాల్లో నీరు తగ్గుతుంది. వాపులు తగ్గుతాయి.
4. కంటి చూపు సమస్యలు, కండరాల బలహీనత, స్పర్శ తగ్గుతుండడం, ఏకాగ్రత లేకపోవడం, అలసట వంటి సమస్యలు ఉన్నవారు ఫుట్ మసాజ్ చేసుకోవాలి. దీంతో త్వరగా ఉపశమనం లభిస్తుంది.
5. తలనొప్పి సమస్యతో బాధపడేవారు ముందుగా రెండు కాళ్లకు చెందిన బొటనవేళ్లకు మసాజ్ చేయాలి. తరువాత మిగిలిన వేళ్లకు చేయాలి. వేళ్లను కొంత సేపు ఒత్తి పట్టుకుని తరువాత విడిచిపెట్టాలి. దీన్నే స్క్వీజ్ అండ్ రిలీజ్ టెక్నిక్ అంటారు. ఇలా చేయడం వల్ల తలనొప్పి తగ్గుతుంది.
6. పాదాల నుంచి వెన్నెముకను కలిపే నాడులు అనుసంధానం అయి ఉంటాయి. అందువల్ల పాదాలను మసాజ్ చేస్తే వెన్నెముకకు శక్తి లభిస్తుంది. వెన్నెముక బలంగా మారుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365