Mint Coriander Leaves Juice : ప్రస్తుత కాలంలో మారిన మన జీవన విధానం, మన ఆహారపు అలవాట్లు మనల్ని అనేక అనారోగ్య సమస్యల బారిన పడేలా చేస్తున్నాయి. వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవడం, నూనెలో వేయించిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, పోషకాలు కలిగిన ఆహారాలను తక్కువగా తీసుకోవడం, తీపి పదారర్థాలను ఎక్కువగా తీసుకోవడం వంటి అనేక కారణాల చేత మనం పలు రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నాం. మన ఆరోగ్యం మన తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. బీపీ, షుగర్, థైరాయిడ్, గ్యాస్, అజీర్తి, మలబద్దకం, గుండె జబ్బులు, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరుకుపోవడం, అధిక బరువు, కీళ్ల నొప్పులు అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
ఈ సమస్యల నుండి బయటపడడానికి అనేక రకాల మందులను వాడుతున్నారు. ఈ మందులను వాడుతూనే మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన అనారోగ్య సమస్యలన్నింటిని దూరం చేసే ఈ జ్యూస్ ను తయారు చేసుకోవడానికి గానూ మనం గుప్పెడు పుదీనాను, గుప్పెడు కొత్తిమీరను, పది తులసి ఆకులను, ఒక పెద్ద నిమ్మకాయను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా పుదీనాను, కొత్తిమీరను, తులసి ఆకులను శుభ్రంగా కడగాలి. తరువాత వీటిని చిన్నగా తరగాలి. ఇప్పుడు ఒక జార్ లో తులసి ఆకులు, తరిగిన పుదీనా, కొత్తిమీరతో పాటు ఒక గ్లాస్ నీటిని కూడా పోయాలి. ఇప్పుడు ఈ ఆకులను వీలైనంత మెత్తగా జ్యూస్ లాగా మిక్సీ పట్టుకోవాలి.
తరువాత ఈ జ్యూస్ ను వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ జ్యూస్ లో ఒక నిమ్మకాయ పూర్తి రసాన్ని వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న రోజుకు ఒక గ్లాస్ చొప్పున తాగాలి. దీనిని ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. ఈ విధంగా జ్యూస్ ను తాగుతూ ఉదయం అలాగే రాత్రి పూట పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. మధ్యాహ్నం బ్రౌన్ రైస్ లేదా ఇతర చిరు ధాన్యాలతో వండిన అన్నాన్ని మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. ఈ విధంగా ఆహార నియమాలను పాటిస్తూ కొత్తిమీర, పుదీనా, తులసి ఆకులతో చేసిన జ్యూస్ ను తాగడం వల్ల 15 రోజుల్లోనే మన శరీరంలో వచ్చిన మార్పును గమనించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ చిట్కాను పాటించడం వల్ల మనం చాలా సులభంగా అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.