చిన్నపాటి అనారోగ్య సమస్యలు వస్తే వాటిని నయం చేసుకునేందుకు మందుల షాపుల్లో అనేక ఇంగ్లిష్ మెడిసిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిని పదే పదే వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందువల్ల స్వల్ప అనారోగ్య సమస్యలకు సహజసిద్ధమైన చిట్కాలను పాటించడం మేలు. దీంతో అనారోగ్య సమస్యలు త్వరగా తగ్గడమే కాదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. మనకు తరచూ వచ్చే చిన్నపాటి అనారోగ్య సమస్యలకు ఆయుర్వేదంలో ఏయే చిట్కాలు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. మనలో చాలా మందికి తరచూ జ్వరం వస్తుంటుంది. సీజన్లు మారినప్పుడు సహజంగానే కొందరికి జ్వరం వస్తుంది. అయితే జ్వరాన్ని తగ్గించేందుకు తేనె బాగా పనిచేస్తుంది. రోజూ ఒక టీస్పూన్ తేనెను ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి ఉదయం, సాయంత్రం రెండు పూటలా తీసుకోవాలి. జ్వరం నుంచి వేగంగా బయట పడవచ్చు.
2. శరీరానికి చెమట పట్టినప్పుడు సహజంగానే కొందరికి శరీరం దుర్వాసన వస్తుంటుంది. అలాంటి వారు టమాటాలను ట్రై చేయాలి. టమాటాలను తీసుకుని గుజ్జులా చేసి దాన్ని చెమట ఎక్కువగా పట్టే భాగాల్లో రాయాలి. 15-20 నిమిషాల పాటు ఉండి స్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల చెమట కారణంగా వచ్చే శరీర దుర్వాసన తగ్గుతుంది.
3. నిద్రలేమి సమస్య ఉన్న వారికి ఉల్లిపాయలు బాగా పనిచేస్తాయి. ఒక ఉల్లిపాయను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని ఒక జార్‌లో ఉంచాలి. ఆ జార్‌ను నిద్రించేటప్పుడు బెడ్ పక్కన పెట్టాలి. నిద్ర పట్టడం లేదని భావిస్తే ఆ జార్‌ను ఓపెన్ చేసి అందులోని ఉల్లిపాయలను వాసన చూడాలి. ఇలా చేయడం వల్ల త్వరగా నిద్ర వస్తుంది.
4. దగ్గు, జలుబు సమస్యలు ఉన్నవారికి తేనె, మిరియాల పొడి అద్భుతంగా పనిచేస్తాయి. ఒక టీస్పూన్ తేనెను అంతే మోతాదులో మిరియాల పొడితో కలిపి రోజుకు మూడు పూటలా తీసుకోవాలి. ఆయా సమస్యలు వెంటనే తగ్గుతాయి.
5. ముక్కు దిబ్బడ సమస్య ఉన్నవారికి వాము బాగా పనిచేస్తుంది. వామును కొద్దిగా వేయించి పొడి చేసి దాన్ని ఒక వస్త్రంలో చుట్టి ఆ వస్త్రం నుంచి వచ్చే వాసనను పీలుస్తుండాలి. ముక్కు దిబ్బడ తగ్గుతుంది. వామును నిప్పులపై వేసి దాని నుంచి వచ్చే పొగను పీల్చినా ముక్కు దిబ్బడ తగ్గుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365