Lungs Clean Drink : మన శరీరంలో నిరంతరం పని చేసే అతి ముఖ్యమైన అవయవాల్లో ఊపిరితిత్తులు కూడా ఒకటి. ఊపిరితిత్తుల ఆరోగ్యంపై మన శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత కాలంలో మారిన జీవన విధానం కారణంగా మనలో చాలా ధూమపానం అనే చెడు అలవాటుకు బానిసై అయ్యారు. దీంతో ఊపిరితిత్తుల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఊపిరితిత్తుల సమస్యల బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది. ధూమపానం కేవలం ఊపిరితిత్తుల పైన మాత్రమే కాకుండా మన చర్మం, జుట్టు, మెదడు వంటి వాటిపై కూడా తీవ్ర దుష్ప్రభావాలను చూసిస్తుంది. పొగాకు ఉత్పత్తుల్లో నికోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూసిస్తుంది. అలాగే ఈ నికోటిన్ రక్తంలో, మెదడు మూలాల్లో పూర్తిగా కలిసిపోతుంది.
దీంతో మన శరీరంలో నికోటిన్ శాతం తగ్గగానే మన మెదడు ధూమపానం చేయాలనే కోరికను పెంచుతుంది. దీంతో 4 నుండి 5 సిగరెట్లు తాగాల్సి వస్తుంది. ఒక్క సిగరెట్ ను కాల్చడం వల్ల 4000 రసాయనాలు బయటకు వస్తాయి. ఇందులో 400 పైగా విష పూరితమైనవి, అలాగే 43 కు పైగా రసాయనాలు క్యాన్సర్ ను కలిగిస్తాయి. అలాగే రసాయనాలు రక్తాన్ని కూడా కలుషితం చేస్తాయి. ఈ కలుషితమైన రక్తం శరీరమంతా ప్రవహిస్తుంది. దీంతో ఇతర అవయవాలు కూడా దెబ్బతింటాయి. ఎక్కువగా ధూమపానం చేయడం వల్ల లైంగిక సమస్యలు తలెత్తుతాయి. ఆకలి శక్తి తగ్గుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అలాగే ధూమపానం చేసిన వారి ఊపిరితిత్తులు నల్ల రంగులో ఉంటాయి. నల్లగా ఉండే ఈ ఊపిరితిత్తులు రక్తాన్ని కూడా కలుషితం చేసి తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యేలా చేస్తాయి. కనుక మనం ఊపిరితిత్తులను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి.
ధూమపానం వల్ల వచ్చిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండాలి. ఒక చక్కటి చిట్కాను వాడి మనం మన ఊపిరితిత్తులను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచుకోవచ్చు. ఈ చిట్కాను వాడడం వల్ల ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన మలినాలన్నీ తొలగిపోతాయి. రక్తం కూడా శుద్ధి అవుతుంది. ఊపితిత్తులను శుభ్రపరిచే చిట్కా ఏమిటి.. తయారీకి కావల్సిన పదార్కథాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం అల్లం రసం, దాల్చిన చెక్క పొడి, నిమ్మకాయ రసం, తేనె, అలాగే కాయన్ పెప్పర్ పౌడర్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ నీటిలో పావు టేబుల్ స్పూన్ కాయన్ పెప్పర్ పౌడర్, పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసి కలపాలి.
ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని రోజూ రాత్రి పడుకునే ముందు టీ తాగినట్టు కొద్ది కొద్దిగా తాగాలి. ఇలా తాగడం వల్ల ధూమపానం వల్ల దెబ్బతిన్న ఊపిరితిత్తులు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయి. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన మలినాలు తొలగిపోతాయి. రక్తం కూడా శుద్ధి అవుతుంది. ఈ పానీయాన్ని తరచూ తీసుకోవడం వల్ల శ్వాస వ్యవస్థలో కూడా చక్కటి మార్పు కనబడుతుంది. ధూమపానం చేసే అలవాటు ఉన్న వారు ఈ చిట్కాను వాడడం వల్ల ధూమపానం వల్ల కలిగిన నష్టాన్ని కొంత మేర తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.