Nutmeg For Back Pain : మన వంటగదిలో ఉండే ఒక చక్కటి పదార్థాన్ని ఉపయోగించడం వల్ల కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పులు వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ పదార్థం గురించి తెలుసుకుంటే మనం ఆశ్చర్యపోవాల్సిందే. అలాగే దీనిని వాడడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ పదార్థం మరోమేటిదో కాదు అదే జాజికాయ. ఇది ప్రతి ఒక్కరి వంటగదిలో ఉంటుంది. దీనిని ఎక్కువగా మసాలా దినుసులుగా ఉపయోగిస్తారు. జాజికాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దీనిని సరైన పద్దతిలో ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అయితే జాజికాయను ఎలా ఉపయోగించడం వల్ల మనం అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.. అలాగే దీనిని వాడడం వల్ల మనకు కలిగే ఫలితాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జాజికాయను ఉపయోగించడం వల్ల కీళ్ల నొప్పులను, వెన్ను నొప్పులను, మోకాళ్ల నొప్పులను, కండరాల నొప్పులను తగ్గించుకోవచ్చు. దీనిలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు ఉంటాయి. దీనిని వాడడం వల్ల నొప్పుల నుండి చక్కటి ఉపశమనం కలుగుతుంది. అలాగే జాజికాయ తైలం శరీరంలో వచ్చే అన్ని రకాల నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది. జాజికాయ తైలాన్ని వాడడం వల్ల మనం నొప్పులను చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ తైలం పెయిన్ కిల్లర్ లాగా పని చేస్తుంది. నొప్పులను దూరం చేసే ఈ జాజికాయ తైలాన్ని ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ తైలాన్ని తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక గిన్నెలో 4 టీ స్పూన్ల ఆవ నూనెను తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ జాజికాయ పొడిని వేయాలి. తరువాత ఈ గిన్నెను స్టవ్ మీద ఉంచిచిన్న మంటపై 3 నుండి 4 నిమిషాల పాటు ఈ నూనెను కలుపుతూ వేడి చేయాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపును వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను వాడే ముందు కొద్దిగా వేడి చేసుకోవాలి. తరువాత ఈ నూనెను శరీరంలో నొప్పులు ఉన్న చోట రాసి కొద్దిగా మర్దనా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనె చాలా అద్భుతంగా పని చేస్తుంది.
దీనిని వాడడం వల్ల నొప్పులన్నీ తగ్గుతాయి. అలాగే జాజికాయ పొడిని ఉపయోగించడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది. ఒక గ్లాస్ పాలల్లో చిటికెడు పసుపు, రెండు చిటికెల జాజికాయ పొడి వేసి వేడి చేయాలి. తరువాత ఈ పాలను పడుకోవడానికి అరగంట ముందు తాగి నిద్రపోవాలి. ఇలా తాగడం వల్ల చక్కటి నిద్రను సొంతం చేసుకోవచ్చు. ఈ పాలను తాగడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఈ విధంగా జాజికాయను ఉపయోగించడం వల్ల చక్కటి ఆరోగ్యంతో పాటు శరీరంలో నొప్పులన్నింటిని దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.