సుమారుగా 10వేల ఏళ్ల కిందటి నుంచే మొక్కజొన్నను సాగు చేయడం మొదలు పెట్టారు. అప్పట్లో దీన్ని మెక్సికో, మధ్య అమెరికాల్లో పండించేవారు. అయితే ప్రపంచంలో ఇప్పుడు ఏ మూలకు వెళ్లినా మనకు మొక్క జొన్న లభిస్తుంది. ఇందులో ఫైబర్, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మనకు రెండు రకాల కార్న్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి స్వీట్ కార్న్. కాగా రెండోది మనకు లోకల్ గా లభించే సాధారణ మొక్కజొన్న. అయితే స్వీట్ కార్న్ కన్నా లోకల్ మొక్క జొన్నను తినడమే ఉత్తమం. దీని ద్వారా మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మొక్కజొన్నలో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. అందువల్ల విటమిన్ బి12 లోపం ఉన్నవారు తరచూ మొక్క జొన్నలను తినడం మంచిది.
2. మొక్కజొన్నలోని విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్, ఐరన్‌లు శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి దోహదం చేస్తాయి. దీంతో అనీమియా (రక్తహీనత) సమస్య తగ్గుతుంది.
3. రోజూ శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు, వ్యాయామం చేసేవారు, జిమ్‌లకు వెళ్లేవారు, విద్యార్థులకు శక్తి బాగా కావాలి. అందువల్ల వారు మొక్కజొన్నలను తినాలి. దీంతో బలం బాగా వస్తుంది. దృఢంగా మారుతారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. ఎక్కువ పనిచేసినా అలసిపోరు.
4. సన్నగా ఉన్నామని దిగులు చెందేవారు రోజూ మొక్కజొన్నలను తినడం వల్ల సులభంగా బరువు పెరుగుతారు. ఆరోగ్యవంతమైన రీతిలో బరువు పెరగవచ్చు.
5. మొక్కజొన్నల్లో విటమిన్లు బి1, బి5, సి లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మొక్కజొన్నల్లో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి కనుక షుగర్ ఉన్నవారు తినకూడదని భావిస్తుంటారు. కానీ నిజానికి వీటిలో ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల వీటిని తింటే షుగర్ లెవల్స్ పెరగవు. షుగర్ నియంత్రణలో ఉంటుంది. సాయంత్రం స్నాక్స్ రూపంలో వీటిని ఒక కప్పు మోతాదులో తీసుకోవచ్చు. లేదా వీటితో తయారు చేసే సూప్‌ను తాగవచ్చు.
6. గర్భిణీలు మొక్కజొన్నలను కచ్చితంగా తినాలి. వీటిల్లో ఫోలిక్ యాసిడ్, జియాజాంతిన్, పాథోజెనిక్ యాసిడ్‌లు ఉంటాయి. ఇవి శిశువుల్లో పుట్టుకతో లోపాలు ఉండకుండా చూస్తాయి. అందువల్ల గర్భిణీలు వీటిని కచ్చితంగా తినాలి.
7. మొక్కజొన్నల్లో విటమిన్ సి, లైకోపీన్‌లు అధికంగా ఉంటాయి. అందువల్ల వీటిని తింటుంటే చర్మం సురక్షితంగా ఉంటుంది.
మొక్కజొన్నలను రోజూ ఒక కప్పు మోతాదులో ఉడకబెట్టుకుని ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోవచ్చు. లేదా సాయంత్రం స్నాక్స్ సమయంలో తీసుకోవచ్చు. లేదంటే వీటితో సూప్ తయారు చేసుకుని కూడా తాగవచ్చు. ఎలా తీసుకున్నా మొక్కజొన్నల వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలే కలుగుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365