అధిక బరువును తగ్గించుకోవడం అన్నది అంత తేలికైన పనేమీ కాదు. అందుకోసం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. రోజూ వ్యాయామం చేయాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. తగినన్ని గంటల పాటు నిద్రించాలి. తగినంత నీటిని తాగాలి. అయితే వీటితోపాటు రాత్రి నిద్రకు ముందు కింద తెలిపిన డ్రింక్స్‌ను తాగుతుండాలి. దీని వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. అధిక బరువును వేగంగా తగ్గించుకోవచ్చు. మరి ఆ డ్రింక్స్ ఏమిటంటే..
1. కమోమిల్ (గడ్డి చామంతి) పూల టీ ని తాగితే శరీరంలో గ్లైసీన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది ఒక న్యూరో ట్రాన్స్‌మిటర్. ఇది నాడులను ప్రశాంత పరుస్తుంది. మధ్యస్థ సెడేటివ్‌గా పనిచేస్తుంది. దీంతో శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. ఈ క్రమంలో గ్లూకోజ్ లెవల్స్ తగ్గుతాయి. అధిక బరువు తగ్గుతారు.
2. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసి మరిగించాలి. అనంతరం ఆ నీటిని వడకట్టి అందులో కొద్దిగా తేనె కలిపి గోరు వెచ్చగా ఉన్నప్పుడే తాగేయాలి. రోజూ ఇలా రాత్రి నిద్రకు ముందు తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు.
3. మెంతులను పోషకాలకు గనిగా చెప్పవచ్చు. మెంతులను సరైన సమయంలో తగిన మోతాదులో సరైన విధంగా తీసుకుంటే అనేక అద్భుతాలు జరుగుతాయి. ఇవి జీర్ణశక్తిని పెంచుతాయి. కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. దీంతో కొవ్వు సులభంగా కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. మెంతుల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా మెంతులను వేసి మరిగించి ఆ నీటిని తాగాలి. దీంతో బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365