ప్రతి ఏడాది ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య కాలంలో మనకు సీతాఫలం పండ్లు ఎక్కువగా లభిస్తాయి. అందువల్ల ఆ సీజన్‌లోనే ఈ పండ్లను తినాల్సి ఉంటుంది. అయితే వాటి ఆకులు అలా కాదు, మనకు అవి ఎప్పుడైనా సరే అందుబాటులో ఉంటాయి. వాటిల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. సీతాఫలం ఆకులతో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అందుకు గాను వాటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. డయాబెటిస్ సమస్య ఉన్నవారికి సీతాఫలం ఆకులు చక్కగా పనిచేస్తాయి. ఈ ఆకులను 2-3 తీసుకుని నీటిలో మరిగించి ఆ నీటిని రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగుతుండాలి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
2. సీతాఫలం ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల బారి నుంచి చర్మాన్ని సంరక్షిస్తాయి. చర్మాన్ని ముడతలు పడకుండా చూస్తాయి. ఈ ఆకులను వేసి మరిగించిన నీటిని తాగుతుంటే చర్మ సమస్యలు తగ్గుతాయి.
3. సీతాఫలం ఆకుల్లో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అందువల్ల ఈ ఆకులతో తయారు చేసిన నీటిని రోజూ తాగాలి. దీంతో గుండె జబ్బులు.. ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు.
4. సీతాఫలం ఆకులను వేసి మరిగించిన నీటిని తాగుతుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
5. కాలిన గాయాలు, పుండ్లను త్వరగా మానేలా చేసేందుకు సీతాఫలం ఆకులు ఉపయోగపడతాయి. వీటిని 3-4 తీసుకుని పేస్ట్‌లా చేసి ఆ మిశ్రమాన్ని గాయాలు, పుండ్లపై రాస్తుండాలి. దీంతో అవి త్వరగా మానుతాయి.