ఆపరేషన్లు చేసినప్పుడు సహజంగానే పేషెంట్లకు ఎలాంటి ఆహారం తినొద్దని, కనీసం నీళ్లు కూడా తాగొద్దని చెబుతుంటారు. ఖాళీ కడుపుతో హాస్పిటల్‌కు రావాలని చెబుతారు. ముందురోజే అలా చెబుతారు. కనుక తరువాత రోజు ఖాళీ కడుపుతో వెళ్తారు. దీంతో వైద్యులు ఆపరేషన్ చేస్తారు. అయితే ఆపరేషన్ చేసే రోజు ఆహారం కాదు కదా, కనీసం నీళ్లను కూడా తాగొద్దని డాక్టర్లు చెబుతారు. దీని వెనుక ఉన్న అసలైన కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఆపరేషన్ చేసే రోజు నీళ్లను తాగినా, ఆహారం తిన్నా.. అది ఆపరేషన్ చేసే సమయంలో జీర్ణాశయం నుంచి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. మత్తు మందు ఇస్తారు కనుక దాని ప్రభావం వల్ల జీర్ణాశయంలో ఉండే ఆహారం, ద్రవాలు ఊపిరితిత్తుల్లోకి చేరేందుకు అవకాశం ఉంటుంది. దీన్నే యాస్పిరేషన్ అంటారు. ఈ స్థితికి చేరుకుంటే ప్రమాదకర పరిస్థితులు సంభవిస్తాయి.
ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు మందు ఇస్తారు కనుక ఆ సమయంలో జీర్ణాశయంలో ఆహారం, ద్రవాలు ఉంటే ప్రమాదం. అవి ఊపిరితిత్తుల్లోకి చేరి వాంతులు, విరేచనాలు అయ్యేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఇన్‌ఫెక్షన్లు కూడా రావచ్చు. ఇక ఊపిరితిత్తుల్లో శ్వాస ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతో శ్వాస సరిగ్గా అందదు. ఫలితంగా ప్రాణాలను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకనే ఆపరేషన్ చేసే రోజున ఆహారం తినొద్దని, నీళ్లను తాగవద్దని చెబుతారు. ఆపరేషన్ చేయడానికి ముందు, చేశాక శక్తి కోసం గ్లూకోజ్ ఎక్కిస్తారు. అంతేకానీ వేటినీ ఆపరేషన్‌కు ముందు తిననివ్వరు. తాగనివ్వరు.
ఇక కొన్ని రకాల వైద్య పరీక్షలను చేసేటప్పుడు ఆహారం తిని, ద్రవాలను తాగి ఉంటే శరీరంలోని అవయవాలను పరిశీలించడం సాధ్యం కాదు. టెస్టు రిజల్ట్ సరిగ్గా రాదు. కనుకనే కొన్ని రకాల టెస్టులకు ఏమీ తినకుండా, తాగకుండా రావాలని చెబుతుంటారు. ఇవీ.. వీటి వెనుక ఉన్న అసలు కారణాలు.