Soaked Walnuts Benefits : మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ అన్ని రకాల పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవడం తప్పనిసరి. పోషకాలు అంటే మనకు కేవలం పండ్ల ద్వారా మాత్రమే కాదు, అనేక రకాల నట్స్, సీడ్స్ ద్వారా కూడా లభిస్తాయి. అయితే తినేందుకు అనేక రకాల నట్స్ అందుబాటులో ఉన్నా వాటిల్లో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే వాల్‌నట్స్ కూడా చాలా ప్రత్యేకమైనవని చెప్పవచ్చు. వీటిని నేరుగా తినలేం. కానీ నీటిలో నానబెట్టి తినవచ్చు. దీంతో సులభంగా జీర్ణమవుతాయి. పోషకాలు కూడా లభిస్తాయి. ఈ క్రమంలోనే రోజూ 3 వాల్‌నట్స్‌ను నీటిలో నానబెట్టి తిన్నా చాలు, మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. వాల్‌నట్స్‌ను నీటిలో నానబెట్టి తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వాల్‌నట్స్‌ను నీటిలో నానబెట్టి రోజూ 3 చొప్పున తింటే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) స్థాయిలు తగ్గుతాయి. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) స్థాయిలు పెరుగుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. రక్తనాళాలు క్లీన్ అవుతాయి. వాల్‌నట్స్ చూసేందుకు అచ్చం మెదడును పోలి ఉంటాయి. కనుకనే అవి మెదడు పనితీరును కూడా మెరుగు పరుస్తాయి. మెదడు యాక్టివ్‌గా మారుతుంది. ఉత్తేజంగా పనిచేస్తారు. నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యం మెరుగు పడుతుంది. నరాల బలహీనత తగ్గుతుంది. మెడ నొప్పి, భుజాల నొప్పుల నుంచి ఉపశమం లభిస్తుంది.
వాల్‌నట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. మలబద్దకం, గ్యాస్, అసిడిటీ తగ్గుతాయి. అధిక బరువు తగ్గుతారు. శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. వాల్‌నట్స్‌లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. కనుక వీటిని రోజూ తింటే నొప్పులు, వాపులు తగ్గుతాయి. ముఖ్యంగా కీళ్లు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు రోజూ వీటిని తింటే ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. వాల్ నట్స్‌లో క్యాల్షియం కూడా పుష్కలంగానే ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మారుస్తుంది. విరిగిన ఎముకలు ఉన్నవారు వాల్ నట్స్‌ను రోజూ తింటే ఫలితం ఉంటుంది. ఎముకలు త్వరగా అతుక్కుంటాయి.
వాల్ నట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మంపై ఉండే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా మారి మృదువుగా తయారవుతుంది. చర్మ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. వాల్ నట్స్‌ను రోజూ నానబెట్టి తినడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. షుగర్ ఉన్నవారికి ఇవి ఎంతగానో మేలు చేస్తాయి. వీటిని రోజూ తినడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. వాల్ నట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కనుక ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇలా వాల్ నట్స్‌ను రోజూ నానబెట్టి తింటే ఎన్నో లాభాలను పొందవచ్చు.