Vitamin C : మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన విటమిన్లలో విటమిన్ సి ఒకటి. ఇది మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. Vitamin C ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే మన శరీరం ఐరన్‌ను ఎక్కువగా శోషించుకుంటుంది. దీంతో రక్తహీనత నుంచి బయట పడవచ్చు. ఇలా విటమిన్ సి తో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
అయితే Vitamin C మనకు ఎక్కువగా కూరగాయలు, పండ్ల ద్వారా లభిస్తుంది. ఇది నీటిలో కరిగే విటమిన్. కనుక ఇది శరీరంలో నిల్వ కాదు. కాబట్టి ఈ విటమిన్ రోజూ లభించేలా తీసుకోవాలి.
మనకు రోజుకు 65 నుంచి 90 మిల్లీగ్రాముల వరకు విటమిన్ సి అవసరం అవుతుంది. విటమిన్ సి లోపం ఉన్నవారికి వైద్యులు రోజుకు 2000 మిల్లీగ్రాముల Vitamin C అందేలా ట్యాబ్లెట్లు ఇస్తుంటారు. ఇక విటమిన్ సి మనకు వేటిలో ఎక్కువగా లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Vitamin C : మనకు రోజుకు విటమిన్ సి ఎంత అవసరం ? వేటిలో విటమిన్ సి అధికంగా ఉంటుందో తెలుసా ?
విటమిన్ సి మనకు కూరగాయలు, పండ్లలో ఎక్కువగా లభిస్తుంది. అత్యధికంగా విటమిన్ సి జామకాయల్లో ఉంటుంది. ఒక కప్పు జామ కాయ ముక్కలను తినడం ద్వారా మనకు 377 మిల్లీగ్రాముల Vitamin C లభిస్తుంది. అంటే దాదాపుగా రోజూ ఒక జామకాయను తింటే చాలన్నమాట. దాంతో మనకు రోజుకు కావల్సిన విటమిన్ సి కన్నా 5 రెట్ల ఎక్కువ విటమిన్ సి లభిస్తుంది.
ఇక జామకాయల తరువాత క్యాప్సికంలో అధికంగా Vitamin C ఉంటుంది. ఒక కప్పు క్యాప్సికమ్‌ను తింటే 190 మిల్లీగ్రాముల విటమిన్ సి లభిస్తుంది. తరువాత కివీలను ఒక కప్పు తింటే 167 మిల్లీగ్రాములు, స్ట్రాబెర్రీలు అయితే ఒక కప్పుకు 98 మిల్లీగ్రాములు, నారింజలు అయితే 96, బొప్పాయి అయితే 88, టమాటాలు అయితే 55, మామిడి కాయలు అయితే ఒక కప్పుకు 32 మిల్లీగ్రాముల వరకు విటమిన్ సి లభిస్తుంది.
అందువల్ల ఆయా పండ్లు, కూరగాయల్లో వేటి నైనా సరే రోజూ తింటుంటే మనకు కావల్సినంత Vitamin C లభిస్తుంది. దీంతో విటమిన్ సి లోపం రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.