ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు బాగా సంపాదించాలని కలలు కంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. సంపాదించే క్రమంలో ఎవరైనా కోటీశ్వరులైతే, అతను తన పిల్లలకు మంచి విద్యను అందించడంతో పాటు ప్రధాన వైద్య సేవలని కూడా అందించగలడు. ప్రస్తుతానికి అతనిని ధనవంతుడిగా పరిగణించవచ్చు. అయితే భవిష్యత్‌లో అతని అవసరాలు ఏంటి, అన్నీ ఖర్చులని తీర్చుకోగలడా అనేది సస్పెన్స్. ద్రవ్యోల్బణం అనేది కాలక్రమేణా డబ్బు విలువను తగ్గిస్తుంది, వస్తువులు మరియు సేవలను మరింత ప్రియం చేస్తుంది. ఇరవై సంవత్సరాల క్రితం మీరు రూ. 100కి కొనుగోలు చేయగలిగిన దాని ధర ఇప్పుడు గణనీయంగా పెరిగింది. గత దశాబ్దంలో భారతదేశంలో సగటు వార్షిక ద్రవ్యోల్బణం రేటు దాదాపు 5-6%కి చేరుకుంది మరియు ఇదే ధోరణి కొనసాగితే, రాబోయే దశాబ్దాల్లో డబ్బు కొనుగోలు శక్తిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది.
ఆర్థికవేత్తలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024 జూలై-సెప్టెంబర్ లో 4.4 శాతం ద్రవ్యోల్బణ అంచనా వేసింది. కానీ ఆశ్చర్యపరుస్తూ జూలై 2024లో ద్రవ్యోల్భణం 3.5 శాతంగా నమోదయ్యింది. మనం జీతాలు మరియు ధరలను పరిశీలిస్తే కొనుగోలు శక్తిపై ద్రవ్యోల్బణం ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు 1950లో 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ.99 ఉండగా, నేడు దాదాపు రూ.78,000కి చేరుకుంది. ఈ విపరీతమైన మార్పు గతంలో సరసమైనదిగా ఉండేవి నేడు మాత్రం అలా లేదని అర్ధమయ్యేలా చేస్తుంది. 1950లో నెలకు రూ. 200 సంపాదించే వ్యక్తి యొక్క కొనుగోలు శక్తి అదే జీవన ప్రమాణాన్ని కొనసాగించడానికి నేడు నెలకు రూ. 1.5 లక్షలకు పైగా ఆదాయం అవసరం.
20 సంవత్సరాల క్రితం (2004)..ద్రవ్యోల్బణం కారణంగా రూ. 1 కోటి ఇప్పుడు దాదాపు రూ. 38 లక్షలకు సమానం. 30 సంవత్సరాల క్రితం (1994) రూ. 1 కోటి ఈరోజు దాదాపు రూ. 23.2 లక్షలకు అనువదిస్తుంది. కాలక్రమేణా ద్రవ్యోల్బణం డబ్బు విలువను ఎలా తగ్గిస్తుందో స్పష్టంగా అర్ధమవుతుంది. చాలా మంది వ్యక్తులు నేడు తమ పెట్టుబడుల నామమాత్రపు విలువపై దృష్టి సారిస్తారు, భవిష్యత్తులో వారి నిజమైన కొనుగోలు శక్తిని ద్రవ్యోల్బణం ఎలా ప్రభావితం చేస్తుందో పరిగణనలోకి తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తారు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను ప్లాన్ చేసేటప్పుడు ఈ మార్పులను పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం.