Periods : నేటి తరుణంలో మారిన జీవన విధానం కారణంగా చాలా మంది స్త్రీలల్లో నెలసరి ఆలస్యంగా వస్తుంది. అలాగే నెలసరి సమయంలో తలెత్తే ఇబ్బందులు కూడా మరింత తీవ్రమయ్యాయి. నెలసరి సరిగ్గా సమయానికి వచ్చిన వారిని అదృష్టవంతులుగా భావించాల్సిన పరిస్థితి నెలకొంది. చాలా మంది స్త్రీలల్లో పొత్తి కడుపులో నొప్పిగా ఉన్నప్పటికి నెలసరి రోజురోజుకు ఆలస్యమవుతూ ఉంటుంది. నెలసరి ఎప్పుడూ వస్తుందా అని ఎదురు చూడాల్సి వస్తుంది. అలాగే కొందరిలో నెలసరి వచ్చినప్పటికి పొత్తి కడుపులో నొప్పి తీవ్రంగా ఉంటుంది. అలాగే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఒఇక చక్కటి ఆయుర్వేద చిట్కాను వాడడం వల్ల నెలసరి సమయానికి రావడంతో పాటు ఆ సమయంలో పొత్తి కడుపులో ఎక్కువగా నొప్పి లేకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నెలసరి సమయానికి వచ్చేలా చేసే ఆ చిట్కా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం వామును ఉపయోగించాల్సి ఉంటుంది. నెలసరి ఆలస్యమవ్వకుండా ఒకటి రెండు రోజుల్లోనే వచ్చేలా చేయడంలో వాము సహాయపడుతుందని నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేసారు. వాముతో డికాషన్ ను తయారు చేసుకుని తాగడం వల్ల నెలసరి ఆలస్యమవ్వకుండా వెంటనే రావడంతో పాటు కడుపులో నొప్పి కూడా తక్కువగా ఉంటుందని నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేసారు. వాములో థైమాల్, సాపోనిన్ అనేరెండు రసాయన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి గర్భాశయంలో కండరాలు ఒకే మోతాదులో సంకోచించేలా చేసి రక్తస్రావం ప్రారంభమయ్యేలా చేయడంలో దోహదపడతాయి.
అలాగే ఈ కషాయాన్ని తీసుకోవడం వల్ల ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ నెలసరి సమయంలో రక్తస్రావం సరిగ్గా అయ్యేలా చేయడంలో ఉపయోగపడుతుంది. అలాగే గర్భాశయంలో పొరలు తొలగిపోయేటప్పుడు ప్రొస్టాగ్లాడిన్ అనే రసాయనాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఇవి రసాయనాలు నొప్పిని కలిగిస్తాయి. వాము కషాయాన్ని తీసుకోవడం వల్ల ప్రొస్టాగ్లాడిన్ అనే రసాయనాలు నియంత్రణలో ఉంటాయి. దీంతో నొప్పి సహాజంగా తగ్గుతుంది. నెలసరి సమయంలో తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడే వారు ఈ వాము డికాషన్ ను తీసుకోవడం వల్ల మంచిఫలితం ఉంటుందని వారు చెబుతున్నారు. అయితే నెలసరి సమయంలో ఎక్కువగా రక్తస్రావం అయ్యే వారు ఈ వారు కషాయాన్ని తాగకపోవడమే మంచిదని ఈ కషాయాన్ని తాగడం వల్ల రక్తస్రావం మరింత ఎక్కువగా అయ్యే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
నెలసరి ఆలస్యమవ్వకుండా సమయానికి వచ్చేలా చేయడంలో అలాగే నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించడంలో అదే విధంగా నెలసరి సమయంలో సరిగ్గా రక్తస్రావం అయ్యేలా చేయడంలో వాము కషాయం ఎంతగానో ఉపయోగపడుతుందని స్త్రీలు ఈ వాము కషాయాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.