Gadapa : మనం ఎవరమైనా ఇండ్లను కట్టుకుంటే తలుపులకు కచ్చితంగా గడపలు పెట్టుకుంటాం. ఇంట్లో ఎన్ని దర్వాజాలు బిగిస్తే అన్ని గడపలు కచ్చితంగా ఉంటాయి. అయితే ఇంటికి ఉండే ప్రధాన ద్వారం వద్ద మాత్రం గడప కొద్దిగా పెద్దదిగా ఉంటుంది. దీనికి తోడు ఆ గడపను పూజిస్తారు. మహిళలు వాటికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి పూజిస్తారు. అయితే మీకు తెలుసా..? మహిళలు ఎందుకు అలా చేస్తారో..? గడపకు అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తారో..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
గడపలో లక్ష్మీదేవి, తులసి దేవి కొలువై ఉంటారట. వీరు భక్తులకు ధనాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తారట. అందుకే మహిళలు గడపలను అలా పూజిస్తారు. అందువల్లే గడపలకు హిందువులు అంత ప్రాధాన్యతను ఇస్తారు. ఈ క్రమంలోనూ ఎవరూ కూడా గడపలపై నిలబడరు. దానికి కాళ్లను తగలనీయరు. అంతేకాదు.. గడపలపై కూర్చోరు కూడా. అలా చేస్తే ఆ ఇంట్లో వారికి ధనం నిలవదట. ఆరోగ్యం సరిగ్గా ఉండదట.
అదేవిధంగా గడపకు అవతల ఒకరు, ఇవతల ఒకరు నిలబడి ఏదీ తీసుకోరు, ఇవ్వరు. అలా చేస్తే ఇద్దరికీ నష్టమే జరుగుతుందట. అన్నీ సమస్యలే ఎదురవుతాయట. ఇదే కాదు, ఇంతకు ముందు చెప్పిన విషయాలను కూడా సరిగ్గా పాటించకపోతే అప్పుడు లక్ష్మీ దేవి, తులసిలను అవమానించినట్టే అవుతుందట. అందుకని గడపకు కచ్చితంగా ప్రాధాన్యతను ఇవ్వాల్సిందేనని పండితులు చెబుతున్నారు. అయితే గడపపై తల కూడా పెట్టి నిద్రించకూడదట. అలా చేస్తే అన్నీ అరిష్టాలే కలుగుతాయట.. అయితే గడప ముందు చక్కని ముగ్గు వేస్తే లక్ష్మీ దేవి ఆ ఇంట నివాసం ఉంటుందట. దీంతో ఆ ఇంట్లో వారికి ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయట.