Kidneys Clean : ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే, మంచి ఆహారం, మంచి జీవన విధానంతోపాటు అప్పుడప్పుడూ కొన్ని ఆరోగ్యకరమైన చిట్కాలని కూడా పాటిస్తూ ఉండాలి. ఈ రోజుల్లో చాలా మంది కిడ్నీల సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీలు శుభ్రంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా ఇటువంటివి తప్పకుండా పాటించండి. ఆరోగ్య నిపుణులు చెప్పిన అద్భుతమైన సూత్రాలు ఇవి. అయితే కిడ్నీ సమస్యలు విపరీతంగా పెరిగిపోయిన వాళ్ళకి కాదు ఈ చిట్కాలు.
షుగర్, బీపీతో బాధపడే వాళ్ళలో కిడ్నీల ఆరోగ్యం పాడవకుండా ఉండాలంటే ఈ చిట్కాలని పాటిస్తే సరి. కిడ్నీ సమస్యలు మొదటి దశలో ఉన్న వాళ్ళు కూడా వీటిని పాటించొచ్చు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే నీళ్లు తాగడం చాలా ముఖ్యమైనది. రోజుకి నాలుగు లీటర్ల వరకు నీళ్లు కచ్చితంగా తీసుకోవాలి. ఉదయాన్నే నీళ్లు ఎక్కువ తీసుకోవాలి.
ఏమీ తినకుండా కేవలం నీళ్లతో మాత్రమే ఉండగలిగితే, పన్నెండు వరకు కూడా ఉండగలిగితే కేవలం నీళ్లతో వుండండి. ఇలా నీళ్లు తాగితే మధ్యాహ్నంలోగా రెండు లీటర్ల వరకు యూరిన్ వస్తుంది. 11:30 లేదా 12 గంటలకి మీరు ఒక గ్లాసు నీళ్లలో కొంచెం తేనె, నిమ్మ రసం వేసుకోండి.
ఈ మిశ్రమం తీసుకోండి. ఇలా రోజుకి నాలుగు, ఐదు సార్లు మీరు తేనె నీళ్ళని తీసుకోవచ్చు. మధ్యాహ్నం పూట ఒక కొబ్బరి బొండాం లేదంటే కొంచెం మజ్జిగ తీసుకో వచ్చు. ఇలా ఎక్కువగా లిక్విడ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒంట్లో ఉండే చెడు మలినాలు అన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి. ఇలా ఈ విధంగా మీరు పాటించడం వలన లివర్ క్లీన్ అవుతుంది. అదే విధంగా కిడ్నీలు కూడా క్లీన్ అయిపోతాయి.