Strawberries For White Teeth : చాలామంది, దంతాల విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమందికి, దంతాలు గార పెట్టేస్తూ ఉంటాయి. అలాంటి వాటిని తొలగించడం కొంచెం కష్టమే. మనం నవ్వినప్పుడు, ఖచ్చితంగా మన పళ్ళు కనపడతాయి. మన పళ్ళు అందంగా కనపడకపోతే, నవ్వు కూడా బాగోదు. మనం నవ్వినా, మాట్లాడినా మన పళ్ళు ఇతరులకి కనపడుతుంటాయి. ఒకవేళ కనుక, పళ్ళు పచ్చగా ఉన్నా, గార పట్టేసినా చూడడానికి అసలు బాగోదు. మనకి కూడా, ఏదో ఇబ్బందిగా ఉంటుంది. పసుపుపచ్చ పళ్ళతో, బాధపడే వాళ్ళు ఈ చిన్న చిట్కాని ట్రై చేస్తే మంచిది. స్ట్రాబెరీ తో ఇలా చేసినట్లయితే, అందమైన, తెల్లని పళ్ళని మీ సొంతం చేసుకోవచ్చు.
స్ట్రాబెర్రీ తినడానికి తియ్యగా, పుల్లగా ఉంటుంది. స్ట్రాబెరీ లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి. వీటితో పాటుగా, స్ట్రాబెరీలలో మాలిక్ యాసిడ్ ఉంటుంది. దంతాలని శుభ్రపరచడానికి, నోటిలో ఉన్న సూక్ష్మ క్రిములు నాశనం చేయడానికి సహాయపడుతుంది. గార పట్టిన పళ్ళ పై, స్ట్రాబెరీ పండ్ల ముక్కని రుద్దినట్లయితే, గార, పసుపుపచ్చని మరకలు తొలగిపోతాయి.
తరచు, మీరు ఈ పండ్ల తో, ఇలా రుద్దితే అందమైన తెల్లని పళ్ళని సొంతం చేసుకోవచ్చు. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, సూర్యకిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తాయి. పడుకునే ముందు, కళ్ళ మీద స్ట్రాబెరీ పండ్ల ముక్కల్ని పెట్టుకోవడం వలన, నల్లటి మచ్చలు, వలయాలు తొలగిపోతాయి.
ముఖం అందంగా కాంతివంతంగా కూడా మారుతుంది. అలానే, పాదాల పగుళ్ళతో బాధపడే వాళ్ళు, గోరువెచ్చని నీటిలో పాదాలని శుభ్రం చేసుకుని, తర్వాత స్ట్రాబెరీ మిశ్రమాన్ని పాదాల మీద రాసి, బాగా మర్తన చేయాలి. ఇలా స్ట్రాబెరీ తో పగుళ్లు సమస్య నుండి బయట పడొచ్చు. దంతాల కోసం అయితే, స్ట్రాబెరీ పండ్లని పళ్ళ మీద రుద్దండి. ఐదు నిమిషాలు ఆగిన తర్వాత పళ్ళు ని క్లీన్ చేసుకోండి.