Lord Ganesha : వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి చాలా మంది అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మొట్టమొదట మనం ఏ దేవుడిని పూజించాలన్నా వినాయకుడిని పూజించి, ఆ తర్వాత మిగిలిన దేవుళ్ళని పూజిస్తూ ఉంటాము. వినాయకుడు అడ్డంకులని తొలగిస్తాడు. వినాయకుడు మనం చేసే పనిలో ఏ ఆటంకాలు లేకుండా మన పనులు చక్కగా అయిపోయేటట్టు చూస్తాడు. అయితే వినాయకుడిని పూజించేటప్పుడు మీరు ఈ పూలతో పూజిస్తే వినాయకుడి ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. శ్రేయస్సు కలుగుతుంది.
వినాయకుడిని ప్రసన్నం చేసుకోవాలని అనుకునే వాళ్ళు ఈ పండ్లు, పూలని పెట్టడం మంచిదే. మందారం పూలు అంటే వినాయకుడికి చాలా ఇష్టం. ఎర్రటి పువ్వులు ఏమున్నా వినాయకుడికి పెట్టండి. వినాయకుడికి ఎర్రని పూలతో పూజ చేస్తే చాలా ఇష్టం. వినాయకుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. పారిజాతం పూలతో కూడా వినాయకుడిని ఆరాధించండి. పారిజాతాలు అంటే వినాయకుడికి చాలా ఇష్టం. గరిక కూడా వినాయకుడికి చాలా ఇష్టం. కచ్చితంగా వినాయకుడి పూజలో గరికని ఉపయోగించండి. గరికతో వినాయకుడిని ఆరాధిస్తే కచ్చితంగా వినాయకుడు మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాడు.
జిల్లేడు పూలు అంటే కూడా వినాయకుడికి చాలా ఇష్టం. ఆయనకి కచ్చితంగా జిల్లేడు పూలను కూడా పెడుతూ ఉండండి. కదంబ పుష్పాలు అంటే కూడా ఎంతో ప్రీతి. కదంబ పుష్పాలతో పూజ చేస్తే కచ్చితంగా మీకు శుభం జరుగుతుంది. మల్లెపూలు కూడా వినాయకుడికి పెట్టొచ్చు. వైవాహిక జీవితంలో ప్రశాంతత కలగాలంటే మల్లెపూలతో వినాయకుడిని ఆరాధించండి.
ఇక పండ్ల విషయానికి వస్తే వినాయకుడికి ప్రీతికరమైనవి అరటి పండ్లు, జామ పండ్లు. ఈ రెండు పండ్లను మీరు నైవేద్యంగా పెట్టండి. అలాగే దానిమ్మ పండ్లు, మామిడి పండ్లు అంటే కూడా వినాయకుడికి చాలా ఇష్టం. వీటిని కూడా మీరు నైవేద్యంగా పెట్టండి. చెరుకు అంటే వినాయకుడికి చాలా ఇష్టం. చెరుకుని కూడా మీరు పెట్టొచ్చు. అలాగే సీతాఫలం, యాపిల్ పండ్లు, ఆరెంజ్, పైనాపిల్, అంజీర్, ద్రాక్ష, నేరేడు పండ్లను కూడా మీరు వినాయకుడికి నైవేద్యంగా పెట్టొచ్చు.