Salman Khan : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గత కొన్ని రోజులుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బిష్ఱోయ్ గ్యాంగ్ అతడిని చంపేస్తామంటూ బెదిరింపులకి దిగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు గతంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. సిద్ధిఖీకి మాత్రం బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఎలాంటి బెదిరింపులు లేవు. కానీ తమకు టార్గెట్‌గా ఉన్న సల్మాన్ ఖాన్‌తో సిద్ధిఖీ సన్నిహితంగా ఉండడమే ఈ హత్యకు దారి తీసి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు.ఆ మధ్య బిష్ణోయ్ సన్నిహితుడు రోహిత్ గోదారా మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్ స్నేహితుడు తమ శత్రువు అని పేర్కొన్నారు. రోహిత్ స్టేట్‌మెంట్ సిద్దిఖీ హత్యలో బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉండొచ్చనే బలాన్ని చేకూర్చింది.
ఇక గత కొద్ది రోజులుగా సల్మాన్ ఖాన్‌కి వరుస బెదిరింపులు వస్తూనే ఉన్నాయి.బుధవారం రాత్రి ముంబైలోని దాదర్ ప్రాంతంలో సల్మాన్ సినిమా షూటింగ్‌లో ఉండగా, ఓ వ్యక్తి సెట్లోకి ప్రవేశించి, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరును ప్రస్తావిస్తూ బెదిరింపు బెదిరింపు ధోరణిలో మాట్లాడాడు. అతడిని షూటింగ్‌లో ఉన్న ఇతర సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు.పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అతడిని అరెస్టు చేశారు. శివాజీ పార్కు పోలీసులు అతడిని విచారిస్తున్నారు. సల్మాన్ ఖాన్ హత్యకి ప్లాన్ చేస్తున్నామని, అయితే టైట్ సెక్యూరిటీ కారణంగా ఏం చేయలేకపోతున్నామని అతడు చెప్పినట్టు సమాచారం.
గతంలో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడిన కేసులో దోషిగా తేలిన విషయం తెలిసిందే. ఈ కారణంగా లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ నుంచి సల్మాన్‌కు అనేక హెచ్చరికలు అందాయి.ఇక ఇదిలా ఉంటే వరుస ఫెయిల్యూర్స్ తరువాత సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేందుకు అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్. అందుకే ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న సికందర్ సినిమాలో హిట్ సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తున్నారు. ఈ సినిమాతో కమర్షియల్ హీరోగా తన స్టామినాను మరోసారి ప్రూవ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. టైగర్ 3 ఫెయిల్యూర్ తరువాత సికందర్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు సల్మాన్. సౌత్ డైరెక్టర్ మురుగదాస్ రూపొందిస్తున్న ఈ యాక్షన్ మూవీతో ఎలాగై హిట్ కొట్టాలని కష్టపడుతున్నారు.