Plants : ప్రతి ఒక్కరు కూడా, ధనవంతులవ్వాలని అనుకుంటుంటారు. అందుకనే, వాస్తు ప్రకారం చిట్కాలని కూడా పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరిస్తే, నెగటివ్ ఎనర్జీ ఇంట్లో నుండి తొలగిపోయి, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇంట్లో చెట్లు ఉంటే కూడా ఎంతో మార్పు వస్తుంది. పలు మొక్కలు ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ని తొలగించడానికి, బాగా ఉపయోగపడతాయి. పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి. ఎప్పుడూ కూడా, ముఖద్వారానికి ఎదురుగా కానీ, కిటికీల పక్కన కానీ మొక్కలని, చెట్లని పెంచకూడదు. ఇలా చేయడం వలన, ఇంటి యజమానికి కీడు జరుగుతుంది.
అన్ని రకాల పండ్ల చెట్లని పెంచాలని అనుకునే వాళ్ళు, ఇంటికి తూర్పు వైపున, ఉత్తరం వైపు ఎక్కువ కాళీ స్థలం వదిలి, మిగతా దిక్కుల్లో చెట్లని పెంచాలి. మొక్కలను ఇంట్లో పెంచడం వలన, ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. వాస్తు ప్రకారం ఎడారి మొక్కలు వంటివి ఇంట్లో ఉండకూడదు. ఇటువంటివి దరిద్రాన్ని పట్టిపీడిస్తూ ఉంటాయి. ముళ్ళు ఉండే మొక్కలను కూడా ఇళ్లలో పెంచకండి. బోన్సాయ్ మొక్కల్ని ఇంట్లో పెంచడం అసలు మంచిది కాదు.
ఇంటి ముందు ఖాళీ స్థలంలో కానీ గార్డెన్ లో కానీ పెంచుకోవచ్చు. చింత చెట్టు, గోరింటాకు ఇంటి ప్రాంగణంలో చాలా మంది పెంచుతూ ఉంటారు. కానీ, అవి కూడా ఉండకూడదు. నివసించే ఇంటికి దగ్గరలో, ఈ మొక్కలు ఉంటే, దరిద్రం పట్టుకుంటుంది. ఇంట్లో చనిపోయిన మొక్కలను కూడా ఉంచకూడదు. ఎండిపోయిన మొక్కల్ని కూడా ఇంట్లో పెట్టకూడదు. వీటి వలన నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది.
కాబట్టి, ఈ తప్పులు అస్సలు చేయకండి. నల్ల తుమ్మ చెట్లని కూడా ఇంట్లో పెంచవద్దు. వీలైనంత వరకు, ఇంట్లో ఈ చెట్లు ఏమీ లేకుండా చూసుకోండి. పత్తి మొక్క కూడా ఇంట్లో ఉండకూడదు. ఇటువంటి మొక్కల్ని ఇంట్లో పెంచడం వలన మీకు ఇబ్బంది కలుగుతుంది దురదృష్టం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి.