Curry Leaves For Hair Growth : కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది. కరివేపాకు ని రెగ్యులర్ గా, తీసుకుంటే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. అనేక పోషకాలు అందుతాయి. ఆరోగ్యానికి మాత్రమే కాదు. కరివేపాకుతో అందమైన కురులని కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ రోజుల్లో చాలా మంది, జుట్టు బాగా రాలిపోతుంది. జుట్టు రాలిపోవడంతో, చాలామంది రకరకాల ప్రొడక్ట్స్ ని కొనుగోలు చేసి వాడుతున్నారు. వీటి వలన, పెద్దగా లాభం ఉండట్లేదు. కానీ, డబ్బులు మాత్రం వృధా అయిపోతున్నాయి. ఆడవారిలో, మగవారిలో కూడా ఈ మధ్య జుట్టు బాగా రాలుతుంది.
జుట్టు రాలడానికి పోషకాహారాన్ని తీసుకోవాలి. టెన్షన్, ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. చుండ్రు కారణంగా కూడా జుట్టు రాలుతుంది. అయితే, జుట్టు రాలిపోతున్నట్లయితే, ఈ ఇంటి చిట్కా ద్వారా ఈజీగా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఒక గిన్నెలో, గ్లాసు నీళ్లు పోసుకుని, అందులో కరివేపాకు వేసుకోవాలి. దీనిలోనే ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ కాఫీ పొడి వేసుకుని, ఐదు నిమిషాల పాటు మరిగించాలి. ఇది బాగా మరిగిన తర్వాత, ఆ నీటిని వడకట్టేసుకుని, ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసుకుని, బాగా మిక్స్ చేయండి.
తర్వాత తలకి బాగా పట్టించి, రెండు నిమిషాల పాటు మసాజ్ చేయండి. అరగంట అయ్యాక షాంపుతో తల స్నానం చేస్తే సరిపోతుంది. ఇలా, మీరు ఈ పద్ధతిని వారానికి రెండు సార్లు పాటిస్తే, జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.
తలని ఇది మాయిశ్చరైజ్ చేస్తుంది. డెడ్ హెయిర్ ఫాలికల్స్ ని కూడా, ఇది తొలగిస్తుంది. కరివేపాకు ఆకులలో బీటా ప్రోటీన్ ఎక్కువ ఉంటాయి. జుట్టు రాలడాన్ని ఇది తగ్గిస్తుంది. జుట్టు ప్రోటీన్ తో తయారు చేయబడినందున, జుట్టు పెరుగుదలకు ప్రోటీన్లు అవసరం. కరివేపాకులో అమైనో ఆసిడ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. వెంట్రుకలను, కుదుళ్ళని బలంగా ఉంచుతాయి.