మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ సమయంలో మనిషి మరణానికి దగ్గరవుతాడు. ఇలా జరగకుండా ఉండాలంటే వాటిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రస్తుత రోజుల్లో ఊపిరితిత్తుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య ఎక్కువైపోయింది. న్యూమోనియా, ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఇలా ఎన్నో రకాల కారణాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఊపిరితిత్తులు శరీరం నుంచి కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించడానికి పనిచేస్తుంది కాబట్టి వీటిని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి.
బ్రోకలీని ప్రతిరోజు తీసుకోవడంవల్ల ఊపిరితిత్తుల సమస్యలు తగ్గుతాయి. చలికాలంలో ఇది చాలామంచిది. అలాగే మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. ప్రతిరోజూ గ్లాసు గోరువెచ్చటి నీటిని తీసుకోండి. అందులో నాలుగు స్పూన్ల తేనెను కలపండి. అలాగే ఒక స్పూను నిమ్మరసం కూడా కలపండి. అందులోనే చిటికెడు మిరియాల పొడి, చిటికెడు యాలకుల పొడి వేసి బాగా కలిపి తాగుతూ ఉండండి. ఈ గ్లాసు నీటిని ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి తాగుతూ ఉంటే ఎంతో మంచిది. అయితే ఈ సమయంలో మిగతా ఆహారాలను తీసుకోకూడదు. సాల్ట్ థెరపీ కూడా బాగా పని చేస్తుంది.దగ్గు, జలుబుని తగ్గించేందుకు అల్లాన్ని ఎక్కువగా వాడతాం. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. ఇది శ్వాసకోశ నుండి విషపదార్థాలను తొలగిస్తుంది.
ఒరెగానో ఆయిల్‌ని బాదం నూనెతో సమాన భాగాలుగా కలపండి . మీ నాలుక కింద 1-2 చుక్కలు వేసుకొని 3-5 నిమిషాలు ఉంచుకొని, ఆపై మీ నోరు శుభ్రం చేసుకోండి. ఈ ప్రక్రియను రోజుకు మూడు సార్లు ఒక నెలపాటు అనుసరించడం వల్ల ఉపశమనం పొందవచ్చు. వారానికి కనీసం మూడు సార్లు వేడి ఆవిరి స్నానం లేదా స్నానం చేయండి. మంచి ఫలితం ఉంటుంది. కారంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. జున్ను, వెన్న, పెరుగు, పాల ఉత్పత్తులు మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలు వంటి కొన్ని ఆహారాలు ఊపిరితిత్తులలో శ్లేష్మం పెంచుతాయి. వాటిని పరిమితంగా వాడాలి. మీ దంతాలను సరిగ్గా బ్రష్ చేయడంతో పాటు, మీ నాలుకను శుభ్రం చేయడం చాలా అవసరం, ఎందుకంటే బ్యాక్టీరియా తరచుగా అక్కడ పేరుకుపోతుంది , అది సులభంగా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఊపిరితిత్తులను సహజంగా శుభ్రపరచడానికి కొన్ని శ్వాస వ్యాయామాలు చాలా ముఖ్యమైనవి.