Dreams : మనం రోజూ రాత్రి నిద్రిస్తే మనకు అనేక రకాల కలలు వస్తుంటాయి. కలలు రావడం అన్నది సహజం. మనం రోజూ అనేక కలలు కంటాం. కానీ వాటిల్లో చాలా వరకు మనకు గుర్తుండవు. ఉదయం నిద్ర లేచిన వెంటనే మనం ఆ కలలను మరిచిపోతాం. అయితే కొన్ని రకాల కలలు మాత్రం మనకు ఎల్లప్పుడూ గుర్తుంటాయి. ఇక తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య బ్రహ్మ ముహుర్తం ఉంటుంది కనుక ఆ సమయంలో వచ్చే కలలు నిజం అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయని స్వప్న శాస్త్రం చెబుతోంది. ఇక ఆ సమయంలో పలు రకాల కలలు వస్తే మనకు అంతా మంచే జరుగుతుందని కూడా ఆ శాస్త్రం వివరిస్తోంది. ఇక ఏ కలలు వస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు స్నానం చేస్తున్నట్లు లేదా నీటిలో ఆడుతున్నట్లు, మీ ఇంటి ముందు నీరు నిలిచి ఉన్నట్లు, మీరు నదిలో ప్రయాణం చేస్తున్నట్లు లేదా మీరు నీటిని చూసినా.. ఇలాంటి కలలు వస్తే చాలా మంచిద. మీకు ఏదో శుభం జరగబోతుందడానికి ఇది సంకేతం అట. ఇక తామర పువ్వు సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపం అని చెబుతారు. కనుక కలలో మీకు తామర పువ్వు కనిపిస్తే మీకు త్వరలోనే ఆకస్మిక ధనలాభం కలగబోతుందని అర్థం. మీకు కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి. మీకున్న ఆర్థిక సమస్యలు పోతాయి. మీరు కష్టాల నుంచి గట్టెక్కుతారు.
ఇక మీకు కలలో వర్షం కనిపించినా లేదా వర్షంలో తడుస్తున్నట్లు కల వచ్చినా మీరు తలపెట్టబోయే కార్యాల్లో విజయం సాధిస్తారని అర్థం చేసుకోవాలి. అలాగే మీకు కలలో మంచి ఆహారం కనిపిస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు కొదువ ఉండదని, మీపై లక్ష్మీదేవి, అన్నపూర్ణా దేవిల ఆశీర్వాదం ఉందని అర్థం చేసుకోవాలి. ఇలా మీకు వచ్చే కలలను బట్టి వాటి ఫలితాలను అర్థం చేసుకోవచ్చు.