ప్రస్తుతం ఇండియాలో గ్యాస్ సిలిండర్ ధరలు మండి పోతున్నాయి. వంట గ్యాస్ ధర వెయ్యి రూపాయలు దాటగా… కమర్షియల్ సిలిండర్ ధర ఇంకా పైమాటే. అయితే ఒక టిప్ ఫాలో అయితే.. ఏకంగా 370 రూపాయలను ఆదా చేసుకోవచ్చు. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర చూసుకున్నట్లయితే వెయ్యి రూపాయలు చేరుకుంది.
పిఎన్జి విషయానికి వస్తే ప్రస్తుత లెక్కల ప్రకారం స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ కు ముప్పై ఐదు రూపాయల 61 పైసలు ఉంది. అదే కేజీల ప్రకారం చూసుకుంటే కేజీకి 45 రూపాయలు ఆదా అవుతుంది.
అంటే 14.2 కేజీలకు చూసుకున్నట్లయితే 639 రూపాయలు ఆదా అవుతుంది. అయితే మీరు ఎల్పీజీ కాకుండా పిఎన్ జి సిలిండర్ ను ఉపయోగిస్తే ఏకంగా 369 రూపాయలకు పైగా ఆదా చేసుకోవచ్చు. Png సిలిండర్లను అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ కనుక ఇవి అందుబాటులోకి వస్తే ప్రతి ఒక్కరు కూడా 369 రూపాయలు ఆదా చేసుకోవచ్చు.