పెళ్లయిన స్త్రీ, కుంకుమ ధరించడం వల్ల భర్త ఆయుష్షు పెరుగుతుందని భావిస్తూ ఉంటారు. స్త్రీ సౌభాగ్యం కూడా పెరుగుతుందని చెబుతూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో కుంకుమ ధరించడం కూడా అలంకరణగా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సింధూరం ధరించే క్రమంలో కొన్ని పొరపాట్లు చేయకూడదట మరి ఆ పొరపాట్లు ఏంటో ఓసారి చూద్దాం.
హిందూ సాంప్రదాయం ప్రకారం, సింధూరం ధరించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలట. స్నానం చేసిన వెంటనే, మహిళలు వెంటనే ముఖానికి కుంకుమ పెట్టుకోకూడదట. దీనివల్ల ఇంట్లో ఆర్థిక సంక్షోభం కలుగుతుందట. కేవలం స్నానం చేసిన తరువాత మాత్రమే కాదు. తలస్నానం చేసిన తర్వాత కూడా వెంటనే కుంకుమ పెట్టుకోకూడదట. ఈరోజుల్లో చాలామంది మహిళలు జుట్టుకు రంగులు వేసుకుంటున్నారు. తలస్నానం చేసిన తర్వాత రంగు పోతుంది కాబట్టి, ఆ వెంటనే నుదుటిన కుంకుమ పెట్టుకోకూడదట. దానివల్ల నెగెటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉందట. అంతే కాకుండా కుటుంబ కలహాలు కూడా పెరుగుతాయట.
జుట్టు కడిగిన తర్వాత సింధూరం: తల స్నానం చేసిన తర్వాత మాత్రమే కాకుండా, మీ జుట్టుని కడిగిన తర్వాత కూడా కుంకుమపువ్వు రాయకండి. ఈరోజుల్లో చాలామంది మహిళలు తమ జుట్టుకు రంగులు వేసి, జుట్టును మాత్రమే కడుగుతున్నారు. అలాంటివారు కూడా జుట్టు కడిగిన వెంటనే కుంకుమ రాసుకోకూడదు. ఇలా చేయడం వల్ల మనలో నెగటివ్ ఎనర్జీ ప్రభావం పెరుగుతుంది. దీంతో మహిళలు బాధపడాలి. సంతోషం – శాంతికి భంగం కలుగుతుంది. కుటుంబ కలహాలు పెరుగుతాయి.
మీ దగ్గరి కుంకుమను వేరే వారికి ఇవ్వకూడదట. దానివల్ల అశుభం జరుగుతుందని భావిస్తారట. హిందూ గ్రంధాల ప్రకారం సింధూరాన్ని ఎల్లప్పుడూ మీతో ఉంచుకోవాలి. అలాగే వేరొకరి డబ్బుతో కుంకుమను కొనకూడదట. ఇది కూడా మీకు మంచిదికాదట. నుదుటున కుంకుమ పెట్టుకోవడం అంటే, చాలా మంది తల వెంట్రుకల కింద కుంకుమ పెట్టుకుంటూ ఉంటారు. నిజానికి శాస్త్రం ప్రకారం, తల వెంట్రుకల మధ్యలో కుంకుమ దాచకూడదట. ఇది రిలేషన్స్ లో సమస్యలను తీసుకువస్తుంది. పెళ్లి అయిన స్త్రీలు జుట్టుకు పాపిట తీసి అక్కడ కుంకుమ ధరించాలట. దానివల్ల మంచి జరుగుతుందట.