Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Heart Attack Symptoms : ఈ సూచనలు కనిపిస్తున్నాయా ? అయితే మీకు గుండె పోటు వస్తుందని అర్ధం..!

Admin by Admin
November 3, 2021
in వార్త‌లు, వైద్య విజ్ఞానం
Share on FacebookShare on Twitter

Heart Attack Symptoms : ప్ర‌స్తుత త‌రుణంలో గుండె జ‌బ్బులు అనేవి చాలా మందికి కామ‌న్ అయిపోయాయి. చిన్న వ‌య‌స్సులోనే హార్ట్ ఎటాక్ ల బారిన ప‌డుతున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అయితే కార‌ణాలు ఏమైన‌ప్ప‌టికీ హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్ వంటివి వ‌స్తే గుండెకు తీవ్ర‌మైన న‌ష్టం జ‌రుగుతుంది. హార్ట్ ఎటాక్ వ‌చ్చిన వారు బ‌తికే అవ‌కాశాలు ఉంటాయి. కానీ కార్డియాక్ అరెస్ట్ వ‌స్తే మాత్రం బ‌తికే అవకాశాలు కేవ‌లం 5 శాతం మాత్ర‌మే ఉంటాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Heart Attack Symptoms if you are having these signs then you are getting heart attack

గుండెకు అనుసంధానం అయి ఉండే ర‌క్త‌నాళాల్లో ఏవైనా అడ్డంకులు ఏర్ప‌డితే అప్పుడు గుండెకు ఆక్సిజ‌న్‌, ర‌క్తం స‌రిగ్గా స‌ర‌ఫ‌రా కావు. దీంతో హార్ట్ ఎటాక్ వ‌స్తుంది. అలా కాకుండా గుండె మీద ఒత్తిడి ప‌డ‌డం లేదా గుండె పంపింగ్ వ్య‌వ‌స్థ‌లో లోపాలు ఉన్నా.. కార్డియాక్ అరెస్ట్ వ‌స్తుంది. దీంతో గుండె కొట్టుకోవ‌డం స‌డెన్‌గా ఆగిపోతుంది. ఈ స్థితిలో బాధితులు బ‌త‌క‌డం చాలా క‌ష్ట‌మే అని చెప్ప‌వ‌చ్చు.

అయితే గుండె స‌మ‌స్య‌లు ఉన్న‌వారిలో స‌హ‌జంగానే కొన్ని ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటాయి. వాటిని ముందుగానే గుర్తిస్తే ప‌రిస్థితి తీవ్ర‌త‌రం కాకుండా ప్రాణాల‌ను ర‌క్షించుకోవ‌చ్చు. మ‌రి ఆ ల‌క్ష‌ణాలు ఏమిటంటే..

1. గుండె దగ్గర ప‌ట్టేసిన‌ట్లు ఉండ‌డం, గుండెల్లో మంట‌, సూదుల‌తో పొడిచిన‌ట్లు ఉండ‌డం.. వంటివి గుండె పోటు వ‌చ్చేముందు క‌నిపించే ల‌క్ష‌ణాలు.

2. గుండె స‌మ‌స్య‌లు ఉన్నా లేదా హార్ట్ ఎటాక్ బారిన ప‌డేందుకు కొంత స‌మ‌యం ముందు అయినా స‌రే.. నోరు పొడిగా మారి ఎండిపోతుంది. దాహం విప‌రీతంగా అవుతుంది. శ‌రీరం మొత్తం త‌డిసిపోయేలా చెమ‌ట‌లు ప‌డుతుంటాయి. కొంద‌రు స్పృహ త‌ప్పి ప‌డిపోతారు.

3. గుండె స‌మ‌స్య‌లు ఉన్న‌వారిలో క‌ఫం ఎక్కువ‌గా వ‌స్తుంది. శ‌రీరం బిగుసుకుపోయిన‌ట్లు అనిపిస్తుంది. కొంద‌రికి వాంతి వ‌చ్చిన‌ట్లు వికారంగా ఉంటుంది. కొంద‌రికి చీక‌టిగా ఉన్న‌ట్లు అనిపిస్తుంది.

4. గుండె ఉన్న భాగంలో నొప్పిగా ఉండ‌డం, ఛాతిలో నొప్పిగా ఉండ‌డం, భుజాల్లో నుంచి నొప్పి ద‌వ‌డలు, చేతుల‌కు వ్యాప్తి చెంద‌డం, క‌ద‌ల‌లేని స్థితిలో ఉండ‌డం, ఊపిరి స‌రిగ్గా ఆడ‌క‌పోవ‌డం.. వంటి ల‌క్ష‌ణాలు అన్నీ గుండె పోటు వ‌చ్చే ముందు క‌నిపిస్తాయి.

క‌నుక ఈ ల‌క్ష‌ణాలు ఎవ‌రిలో అయినా ఉంటే ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌ల‌సి ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. ఏదైనా స‌మ‌స్య ఉన్న‌ట్లు తేలితే వెంట‌నే చికిత్స తీసుకోవాలి. దీంతో గుండెను సంర‌క్షించుకోవ‌చ్చు.

Tags: heart attackHeart Attack Symptomsheart healthగుండె ఆరోగ్యంహార్ట్ ఎటాక్‌హార్ట్ ఎటాక్ ల‌క్ష‌ణాలు
Previous Post

Heart Care : శీతాకాలంలో ఎక్కువగా గుండె జబ్బులు రావడానికి గల కారణం ఏమిటో తెలుసా?

Next Post

Diwali Laxmi Puja : ఈ ఏడాది దీపావళి పండుగ రోజు లక్ష్మీ పూజకు సరైన ముహూర్తం ఇదే!

Related Posts

inspiration

చచ్చిన పాము కూడా ఉపయోగమే… గాంధీ చెప్పిన మాట‌..

June 3, 2025
వైద్య విజ్ఞానం

భూమిపై క్యాన్సర్ రాని ఒకే ఒక జంతువు ఏదో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

June 3, 2025
పోష‌కాహారం

ఇప్ప‌టి నుంచి మామిడి పండ్ల‌ను తినే వారు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే.. ఎందుకంటే..?

June 3, 2025
lifestyle

తొడ‌లు లావుగా ఉన్న‌వారు ఇలాంటి దుస్తుల‌ను ధ‌రిస్తే మంచిది..!

June 3, 2025
హెల్త్ టిప్స్

పాదాల వాపులు ఉన్నాయా.. అయితే ఇలా చేయండి చాలు..

June 3, 2025
వైద్య విజ్ఞానం

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే అది డీహైడ్రేష‌న్ అన్న‌మాటే.. ఇలా చేస్తే చాలు..!

June 3, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!