స్త్రీలలో రుతుక్రమం అయ్యాక సరిగ్గా 13, 14, 15 రోజులకు వారిలో అండాలు విడుదల అవుతాయి. అప్పుడు గర్భం వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ రోజుల్లోనే కాదు, కొంచెం అటూ ఇటూగా కూడా కొందరిలో అండాలు విడుదలవుతాయి. ఇది ఏ స్త్రీకి కూడా ఒకే రకంగా ఉండదు. అయితే రుతుక్రమం అనేది మాత్రం స్త్రీలందరిలోనూ సహజమే. ఈ క్రమంలో అదే విషయానికి చెందిన ఓ ముఖ్యమైన అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా స్త్రీలు అండాలు విడుదలైనప్పుడు పురుషులతో సంగమిస్తే గర్భం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఒకసారి ఇద్దరు కలిశాక పురుషుని వీర్యం స్త్రీ గర్భాశయ ద్వారం, దాని నాళాల్లో 72 గంటల వరకు ఉత్తేజంగా ఉంటుంది. అనంతరం క్షీణిస్తుంది. ఆ దశలోనే స్త్రీలు ప్రెగ్నెంట్ అవుతారు. అయితే అప్పుడు ఒక వేళ ఇద్దరూ కలవకున్నా, లేదంటే కలిసినా ఏదైనా సమస్య ఉంటే దాంతో శుక్రకణాలు అండం దగ్గరికి వెళ్లవు. ఫలితంగా పిండం ఏర్పడదు. అప్పుడు అండం రుతుక్రమం వచ్చే సరికి బయటకు వచ్చేస్తుంది. ఆ సమయంలో గర్భం దాల్చేందుకు అవకాశాలు అస్సలు ఏ మాత్రం ఉండవని ఇప్పటి వరకు నమ్ముతూ వస్తున్నారు. అయితే కొందరిలో ఆ సమయంలోనూ గర్భం దాల్చేందుకు అవకాశం ఉంటుందట.
రుతు క్రమ సమయంలో శృంగారంలో పాల్గొంటే అస్సలు గర్భం రాదని ఇప్పటి వరకు నమ్ముతూ వచ్చారు. అయితే అది కొందరిలో మాత్రమే నిజమట. కొందరిలో రుతుక్రమ సమయంలో శృంగారంలో పాల్గొన్నా గర్భం వస్తుందట. సైంటిస్టులు తాజాగా పరిశోధించి చెప్పిన నిజమిది. అయితే కొందరు స్త్రీలలో ఒక్కోసారి అండ దశలో ఉండగానే అంటే రుతుక్రమం మధ్యలో ఉండగానే రక్త స్రావం జరుగుతుందట. దీన్ని చాలా మంది రుతుక్రమంగా భావిస్తున్నారట. అందుకే ఆ సమయంలో శృంగారంలో పాల్గొన్నా గర్భం వస్తోందట. కనుక అలా రుతుక్రమం మధ్యలో బ్లీడింగ్ అయ్యే స్త్రీలు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని, ఒక వేళ శృంగారంలో పాల్గొంటే సురక్షితమైన పద్ధతులను పాటించాలని చెబుతున్నారు..!