ఫీచర్స్ వంటి వాటిల్లో చాలా వరకు ఆండ్రాయిడ్‌తో సమానంగానే ఉంటుంది. చాలా సేవలు ఇప్పుడు ఆండ్రాయిడ్‌లో కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. వేగం.. అప్లికషన్లను ఓపెన్ చేసిన వెను వెంటనే ఓపెన్ అవ్వడం అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండదు.(కరీదైన ఫోన్లు కాకుండా) కానీ ఈ వేగం దాదాపు అన్ని ఐఫోన్లకు ఒకే విధంగా ఉంటుంది. నా వరకు అంటే ఆండ్రాయిడ్ వాడలేను. ఏదో యుగాల తరువాత ఓపెన్ అయినట్టు అనిపిస్తుంది. = సెక్యూరిటీ మీద ఎక్కువగా వాదించను కానీ సగటు ఆండ్రాయిడ్ తో పోలిస్తే చాలా మెరుగు. (అయిన కొంపలు మునిగిపోయే అంత ఏం లేదు నా దగ్గర).
సాధారణ హ్యాకర్లు ఒక చిన్న లింక్ తో మొత్తం డాటా లాగేసే అంత డొల్ల మాత్రం కాదు. యాపిల్ వారి ఏకో సిస్టమ్. అంటే వారి ఇతర ఉపకరణాల ప్రపంచంతో ఉన్న అనుబంధం. ఇక్కడ వారు కేవలం ఫోన్ మాత్రమే అమ్మట్లేదు. ఒక కొత్త అనుభూతిని అమ్ముతున్నారు. iwatch, iPad, Mac బుక్ ఇలా వారి ప్రత్యేక ప్రపంచంతో ఉన్న అనుబంధం. ఇది మనది అన్న ఒక అనుభూతి కలిగిస్తారు. బ్రాండ్ వాల్యూ లేదా స్టేటస్. కేవలం ఐఫోన్ అన్న బ్రాండ్ లేదా అందరి ముందు మెరుగ్గా కనిపించాలి అని ఒక ఆరాటం కోసం కొనేవారు చాలా మంది ఉన్నారు. లేదా మన సర్కిల్ లో మన స్టేటస్ చుపించుకోవాలి అనే ఒక కోరిక చాలా మందికి ఉంటుంది. ఆండ్రాయిడ్ లో లక్ష పెట్టి కొన్నా కూడా ఎవరూ పెద్దగా పట్టించుకోరు, ఆ ఫోన్ లేదా ఫోన్ ఓనర్ ని.
కెమెరా.. ఐఫోన్ కెమెరా నాణ్యత విషయంలో చాలా మంది అభిమానులు ఉన్నారు. ఐఫోన్ లో తీస్తే ఫొటోలు బాగా వస్తాయని కొన్న వాళ్ళు కొంత మంది నాకు తెల్సు. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి గాని ఎక్కువ మంది ఈ పైన ఉన్న 5 పాయింట్స్ వల్ల ప్రభావితం అవుతారు.