టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి ఇప్పటివరకు ఎలాంటి చిన్న అభియోగం కూడా లేని రెబల్ స్టార్ గా తెలుగు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు కృష్ణంరాజు. అంతటి పేరు ఉన్న మహారాజు అనారోగ్య కారణాల వల్ల ప్రాణాలు విడిచారు.. రాజుల వంశానికి చెందిన కృష్ణంరాజు మొదటినుంచి ధనవంతుడు.. 1966లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 185 చిత్రాలకుపైగా నటించారు. రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో ప్రజల్లో మమేకమై ఎంపీగా పలుమార్లు గెలిచి కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
కృష్ణంరాజుకు ముగ్గురు కూతుర్లు. అయితే కృష్ణంరాజు కొన్ని సినిమాలు కూడా నిర్మించారు. నటుడుగానే కాకుండా గోపికృష్ణ మూవీస్ బ్యానర్ పై ఆయన పలు సినిమాలు నిర్మించారు. ఆ సినిమాలు ఏంటో వాటి ఫలితాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి. కృష్ణంరాజు, వాణిశ్రీ జంటగా నటించిన భక్త కన్నప్ప మూవీని బాపు డైరెక్ట్ చేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కృష్ణంరాజు, జయసుధ నటించిన అమరద్వీపం చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకుడు. ఈ మూవీ ఫరవాలేదు అనిపించింది. కృష్ణవేణి.. కృష్ణంరాజు, వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రాన్ని వి.మధుసూదనరావు డైరెక్ట్ చేశారు. ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజుతో కలిసి కృష్ణంరాజు నిర్మించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.
మన ఊరి పాండవులు.. ఈ చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరించారు కృష్ణంరాజు, సూర్యనారాయణ రాజు. జయకృష్ణ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా కూడా ఫరవాలేదు అనిపించింది. సీతారాములు.. కృష్ణంరాజు, జయప్రద జంటగా నటించిన ఈ మూవీని దాసరి నారాయణరావు డైరెక్ట్ చేశారు. ఈ మూవీ కూడా ఫరవాలేదు అనిపించింది. మధుర స్వప్నం.. కృష్ణంరాజు హీరోగా, జయసుధ, జయప్రద హీరోయిన్లుగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా ఫర్వాలేదు అనిపించింది. బొబ్బిలి బ్రహ్మన్న.. కృష్ణంరాజు డబుల్ రోల్ ప్లే చేసిన ఈ మూవీని కె.రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
తాండ్ర పాపారాయుడు.. ఈ మూవీ కూడా కృష్ణంరాజు సొంత నిర్మాణంలో రూపొందింది. దాసరి నారాయణరావు డైరెక్ట్ చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బిల్లా.. ప్రభాస్ హీరోగా, కృష్ణంరాజు కీలక పాత్రలో మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఎబౌవ్ యావరేజ్ గా నిలిచింది. రాధే శ్యామ్.. ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటించిన ఈ మూవీని రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేయగా, యూవీ క్రియేషన్స్ తో కలిసి కృష్ణంరాజు, ప్రసీద నిర్మించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా మిగిలింది.