ఒక ఇండస్ట్రీలో హిట్ అయిన సినిమాని మరో భాషలోకి రీమేక్ చేయడం అనేది సర్వసాధారణమైన విషయమే.. కంటెంట్ బాగుంటే ఏ భాషలో రీమేక్ చేసిన ప్రేక్షకులు ఆదరిస్తారు.. అయితే ఈ వ్యవహారం ఓటీటీ రాకముందు బాగానే ఉండేది.. కానీ ప్రస్తుతం వీటికి అంతగా ఆదరణ లభించడం లేదు. లాక్ డౌన్ సమయంలో ఇతర భాషల్లో రూపొందిన చిత్రాలకు సబ్ టైటిల్స్ పెట్టి చూడటం అనేది అలవాటు చేసుకున్నారు. దాన్ని ఒరిజినల్ లాంగ్వేజ్ లో నటీనటులు ఒరిజినల్ వాయిస్ లతో చిత్రాలు చూడటం అనేది బాగా అలవాటు అయింది. ఈ రీమేకులు పెద్ద హీరోలు చేస్తే తప్ప సినిమాపై అంతగా బజ్ ఏర్పడడం లేదు. సరే వీటిని పక్కన పెట్టేస్తే కొన్ని పరభాషా చిత్రాలు తెలుగులోకి రీమేక్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దీనికి ఉదాహరణ గాడ్ఫాదర్.. అలాంటి సినిమాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం..
లీలామహల్ సెంటర్ : ఆర్యన్ రాజేష్, సదా హీరోయిన్ గా నటించిన మూవీ, ఇది తమిళ ఇండస్ట్రీలో అమర్కలంకి రీమేక్ గా వచ్చింది. కానీ అంతకు ముందు అద్భుతం పేరుతో తెలుగులోకి డబ్ అయింది. నీ జతగా నేనుండాలి : హిందీ సినిమా ఆషికి రీమేక్ గా వచ్చిన ఈ మూవీ తెలుగులోకి డబ్ అయింది కూడా.. కాటమరాయుడు : తమిళ ఇండస్ట్రీలో హిట్ అయిన వీరం కి రీమేక్ గా వచ్చిన మూవీ.. అప్పటికే ఇది వీరుడొక్కడే పేరుతో తెలుగులో కూడా డబ్ అయింది.
గద్దల కొండ గణేష్ : తమిళంలో సూపర్ హిట్ అయినా జీగారతండా రీమేక్ మూవీ.. అప్పటికే చిక్కడు దొరకడు అనే టైటిల్ లో డబ్ అయింది. గాడ్ ఫాదర్ : మలయాళంలో సూపర్ హిట్ లూసిఫర్ మూవీ అనే టైటిల్ తో తెలుగులోకి డబ్ అయింది. మళ్లీ గాడ్ఫాదర్ గా రీమేక్ అయింది. బోలా శంకర్ : ఆవేశం పేరుతో తెలుగులోకి డబ్ అయింది. కానీ చిరుతో బోలా శంకర్ గా రీమేక్ చేశారు. తేరి అనే తమిళ సినిమా తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ అవుతోంది. ఈచిత్రాన్ని సుజిత్ డైరెక్షన్ చేస్తున్నారు. ఇది పోలీసు అనే పేరుతో ఇప్పటికే తెలుగులో డబ్ అయింది.
వినోదయ సీతం రీమేక్ : తమిళ్ సూపర్ హిట్ మూవీ వినోదయ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో రీమేక్ చేశారు. అది ఇప్పటికే తెలుగులో బ్రొ అందుబాటులోకి వచ్చింది. ఎన్ ఐ అరిందాల్ : చిరంజీవితో ఈ మూవీని తెలుగులోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఇప్పటికే ఎంతగాడు గాని అనే పేరుతో తెలుగులోకి డబ్ అయింది.