పంచముఖ ఆంజనేయస్వామి అని మనం వినే ఉంటాం. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గురించి మనకు రామాయణంలో వివరణ దొరుకుతుంది. అయితే ఈ పంచముఖ ఆంజనేయస్వామిని పూజిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఆయన్ని స్మరిస్తే సకల భూత, ప్రేత పిశాచ భయాలు తొలగిపోతాయి.
ఐదు ముఖాలతో ఉండే హనుమంతుని ఒక్కో ముఖానికి ఒక్కో గుణం ఉంటుంది. ఆంజనేయుడు ముఖం ప్రధానంగా ఉంటుంది. ఈ ముఖాన్ని చూస్తే ఇష్ట సిద్ధి కలుగుతుంది. అలాగే మిగిలిన ముఖాలలో నారసింహునికి అభీష్ట సిద్ధి, గరుడునికి సమస్త కష్టాలను నాశనం చేసే శక్తి ఉంటుంది. కుడి వైపు చివరన ఉండే వరాహముఖం దానప్రపత్తిని ఎడమవైపు చివరన ఉండే హయగ్రీవముఖం సర్వవిద్యాలను కలగజేస్తాయి. అందుకనే పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం ద్వారా అన్ని విధాల శుభాలు లభిస్తాయని పండితులు చెప్తున్నారు. పంచముఖ హనుమంతునికి ఉన్న పది చేతుల్లోని ఆయుధాలు భక్తులను కాపాడుతాయి.
నాలుగు దిక్కులతోపాటు పైనుంచి వచ్చే విపత్తుల నుంచి భక్తులను కాపాడేందుకు స్వామి పంచముఖంగా, తుంగభద్ర నది తీరంలో స్వామివారి కోసం తపస్సు ఆచరించిన శ్రీ రాఘవేంద్ర స్వామికి ప్రత్యక్షమైనట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక హనుమంతునికి శని, మంగళవారాల్లో తమలపాకుల మాల, వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి. ఆంజనేయ స్వామికి శ్రీ రామజయం అనే మంత్రాన్ని 108 సార్లు పేపర్ పై రాసి మాలగా వేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.