Home Remedies : మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం అందరికీ తెలిసిందే. మద్యాన్ని మితంగా సేవిస్తే ప్రయోజనాలు కలుగుతాయని.. అప్పుడప్పుడు పరిమిత మోతాదులో మద్యం తీసుకోవచ్చని వైద్యులు చెబుతుంటారు. అయితే నిజానికి చాలా మంది మద్యాన్ని పరిమిత మోతాదులో కాదు, అధికంగానే తీసుకుంటారు. ఇక కొందరు అయితే రోజూ మంచినీళ్లను తాగినట్లు మద్యం తాగుతుంటారు.
అధికంగా మద్యం సేవించడం వల్ల అనేక అనర్థాలు సంభవిస్తాయి. లివర్ చెడిపోతుంది. కిడ్నీలు పాడవుతాయి. హార్ట్ ఎటాక్‌లు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. హైబీపీ వస్తుంది. ఇలా మద్యం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి.
అయితే కొందరు మద్యం అలవాటును మానేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. కానీ తాగుడుకు బానిసై ఆ అలవాటును మానలేకపోతుంటారు. ఈ క్రమంలో అలాంటి వారు కింద తెలిపిన చిట్కాను పాటిస్తే.. మద్యం అలవాటు నుంచి సులభంగా బయట పడతారు. ఇక జీవితంలో మళ్లీ మద్యం జోలికి వెళ్లరు.
గుప్పెడు మెంతులను తీసుకుని నీటిలో నానబెట్టాలి. 4 గంటల పాటు నానబెట్టాక వాటిని అదే నీటిలో మరిగించాలి. అనంతరం ఆ నీటిని వడకట్టాలి. అందులో కొద్దిగా తేనె కలిపి తాగేయాలి. ఇలా రోజుకు ఒకసారి చేయాలి. లేదా మద్యం తాగాలని అనిపించినప్పుడు ఇలా చేయాలి. దీంతో క్రమంగా మద్యం అలవాటు తగ్గుతుంది. దాన్నుంచి సులభంగా బయట పడవ్చు.
మెంతులతోపాటు మెంతి ఆకులను కూడా ఇదేవిధంగా ఉపయోగించవచ్చు. మెంతి ఆకులను తీసుకుని నీటిలో మరిగించి ఆ నీటిలో తేనె కలిపి తాగుతుండాలి. దీంతో మద్యం అలవాటును సులభంగా మానవచ్చు.
అయితే సొంతంగా మద్యం మానాలని అనుకునేవారితోపాటు కుటుంబ సభ్యులు కూడా తమ ఇంట్లో ఎవరైనా తాగుడకు బానిసలు అయినవారు ఉంటే వారిచే ఈ విధంగా చిట్కాలను పాటించేలా చేయవచ్చు. దీంతో వారు మద్యం తాగడం మానేస్తారు.