సాధారణంగా చాలామంది పురుషులకు వంట చేయటం తెలియదు. తినడం పట్ల మీకు అభిరుచి వుంటే, కాస్తో, కూస్తో వంటపై కొంత అవగాహన దానితోపాటు చేయాలనే ఆసక్తి వుంటాయి. వంటలు చేసే పురుషులంటే మహిళలు కూడా ఇష్టపడతారు. మరి వంటలు చేసి మహిళల మెప్పులు పొందాలంటే కొన్ని చిట్కాలు చూడండి. మెప్పు పొందేందుకు వంట చేస్తే మహిళలు ఇష్టపడతారు. చేసిన వంటకాలు ఒక కేండిల్ లైట్ డిన్నర్ గా వుంటే మరింత మెచ్చుకుంటారు. కనుక, ఆమెను వలలో వేసుకోవాలంటే, మీ వంటకాల నేర్పులు ప్రదర్శించండి. అయితే, మీకు అనుభవం లేనివి చేసేసి ఆమె మెప్పు పొందాలనుకోకండి.
వంటలు చేసేటపుడు సాధారణంగా అందరూ చేసేవి చేయకండి. ప్రతిరోజూ వుండే పప్పు, అన్నం వంటివి మీరు చేస్తే అందులో రుచి తెలిసిపోతుంది. మేజీషియన్ తన ట్రిక్కులు చెప్పనట్లు అసలు మీ వంటకం ఏమిటో తెలియకుండా రుచిగా వుండేలా చేయండి. ఆమె కోరితే తప్పక చేయండి. మహిళలు కిచెన్ లో కొన్ని సమయాలలో సహాయం కోరతారు. ఏదేని ప్రత్యేక డిష్ చేసేటపుడు మీరు వంటగదిలోకి దాడిచేసి ఎంతో కొంత సహకరించండి. మహిళలు వారి వంటగదిలోకి త్వరగా రానివ్వరు. కనుక చొచ్చుకుపోయి ఇబ్బంది కలిగించకండి. మీపై అభిమానం పోగొట్టుకోకండి. ఆమెకు సహాయం మాత్రం చేయండి. ఆదేశాలు జారీ చేయకండి.
వంటగది ఆమెకి చెందిందనే విషయం గుర్తించండి. మీరు అవసరం లేదనుకుంటే అక్కడ కొన్ని నిబంధనలుంటాయని గుర్తించండి. ఆమె చేసే పనిలో కలిగించుకోవడం సలహా ఇవ్వడం చేయకండి. ఆమె చెప్పింది చేస్తే ఆమె సంతోషిస్తుంది. చాలా మంది పురుషులు బాగా వంట చేసేవారు ఆమె చేసిన ప్రతి వంటకానికి ఏదో ఒక లోపం వెతికి పట్టుకుని ఎత్తి చూపుతారు. మహిళలు వారి వంటకాల్ని విమర్శిస్తే, మిమ్మల్ని ద్వేషిస్తారు. ఇటువంటపుడు వారు మిమ్మల్ని అన్ని తెలుసు కాని ఏదీ తెలియని పురుషుడని వ్యాఖ్యానించి వంటగదినుండి బయటకు పంపేస్తారు. కనుక ఇటువంటి పరిస్ధితి తెచ్చుకోకండి. ఆదివారం సెలవు దినమా? ఆమెకవసరమైన బ్రేక్ ఫాస్ట్ ఆమె బెడ్ లోనే అందించేయండి. ఇక ఆరోజుకి మీకు ఎంతో ఆనందం ఆమెనుండి దొరుకుతుంది. ప్రశంసించబడతారు.