మా బావగారు తన విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా తనకు రోడ్డు ప్రమాదం జరిగింది ..ఆ ప్రమాదంలో తన ఒకకాలు చాలా దెబ్బతింది ..ఎంతలా అంటే మొదట ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా వాళ్లు కాలు మొత్తం తీసేయాలి అని చెప్పారు ..కానీ అందుకు మేము ఒప్పుకోలేదు ఎలాగైనా బాగుచేయమని కోరాము ..అందుకు వాళ్లు సరే అనేసి ఆపరేషన్స్ చేయడం మొదలుపెట్టారు ..దాదాపు ఆరు ఆపరేషన్స్ చేసారు ..అలా అక్కడే ఎనిమిది నెలలు గడిచిపోయాయి ,అయినాకూడా మా బావలో ఎటువంటి తేడా లేదు ..ఇంక మాకు అర్థం అయిపోయింది వీళ్లు మమ్మల్ని పెట్టుకుని కావాలని సమయం వృథాచేస్తునారు అని ….
ఇక ఆ తర్వాత ఇలానే ఉంటే ఎలా అనేసి వేరొక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాము …అక్కడికి తీసుకెళ్లే అప్పటికే మా బావ కాలు పూర్తిగా పాడైపోయింది …ఖచ్చితంగా కాలు తీసేయాలి ..కానీ ఆ ఆసుపత్రిలో కూడా అదే మాటలు ఆపరేషన్ చేస్తే బాగవుతుందని ..ఏం ఇబ్బంది లేదు మేంచూసుకుంటాం అని చెప్పారు .సరే అనేసి ఇక వాళ్లు మళ్లీ మూడు ఆపరేషన్స్ చేసారు …అలా 2 నెలల గడిచిపోయాయి ..ఆ రెండు నెలలకు మాకు 20లక్షల బిల్లు వేశారు ..సరే ఎలాగైనా మనిషిని బాగు చేసుకోవాలి అని ఉన్నదంతా అమ్మేసి ఆసుపత్రి బిల్లు కట్టేశాము …ఇంతా చేసిన చివరికి వాళ్లు చల్లగా కబురు చెప్పారు ..మేంఎంతగానో ప్రయత్నం చేశాం కానీ కాలు బాగుకాలేదు తీసేయాలి ,లేకుంటే ఇన్ఫెక్షన్ పైకి ఎగబాకుతుంది చనిపోయే ప్రమాదం ఉంది అని చెప్పారు .ఇక చేసేది ఏం లేక చివరికి కాలుతీసేసారు ..
బాధ కలిగే విషయం ఏమంటే ఇంత కష్టపడినా చివరికి తనకి జీవితం అంతా బాధపడేలాగే అయింది .. చివరగా చెప్పాలంటే ప్రైవేటు ఆస్పత్రిలో సామాన్య మనుషుల ఎమోషనల్ వీక్ నెస్ అనేది వాళ్లకు మోసం చేయడానికి చాలా అనువైన విషయం . పైన చెప్పిన రెండు ఆసుపత్రులు మమ్మల్ని డబ్బులు కోసం మోసం చేశారు ..అన్ని ఆసుపత్రులు ఇలానే ఉన్నాయో లేదో నాకు తెలియదు ..నా అనుభవంలో చూసినది నేను పంచుకున్నాను.