Tomato Soup : గత కొద్ది రోజులుగా చలి పులి చంపేస్తోంది. డిసెంబర్ నెల చివరి వారం దగ్గర పడుతుండడంతో అనేక చోట్ల చలి తీవ్రత పెరిగింది. దీంతో చాలా మంది చలికి తట్టుకోలేకపోతున్నారు. అయితే తీవ్రమవుతున్న ఈ చలిని తట్టుకోవాలంటే కచ్చితంగా ఈ సీజన్‌కు తగినట్లుగా ఆహారాలను తీసుకోవాల్సిందే. వాటిల్లో టమాటా సూప్ ఒకటి. దీన్ని చలికాలంలో అస్సలు మిస్ చేయరాదు. రోజూ తీసుకోవాల్సిందే. రోజూ ఒక కప్పు టమాటా సూప్‌ను తాగడం వల్ల ఎంతో లాభం కలుగుతుంది. దీని వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఈ కాలంలో ఎవరికైనా రోగ నిరోధక శక్తి కొంచెం తక్కువగానే ఉంటుంది. బాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్లు వర్షాకాలంలోనే కాదు, ఇప్పుడు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ప్రధానంగా పొగ మంచు రూపంలో అవి ఒకరినుంచి మరొకరికి వ్యాపించవచ్చు. అయితే నిత్యం ఉదయాన్నే ఒక కప్పు టమాటా సూప్ తాగితే అలాంటి ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున టమాటా సూప్ తాగితే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
2. టమాటాల్లో విటమిన్ కె, కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలకు ఎంతగానో మంచిది. ఎముకలు విరిగి అతుక్కుంటున్న వారికి, కీళ్ల నొప్పులు ఉన్నవారికి టమాటా సూప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నిత్యం ఒక కప్పు సూప్ తాగితే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
3. విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల టమాటా సూప్ తాగితే రక్త నాళాల్లో పేరుకుపోయిన అడ్డంకులు తొలగిపోతాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది. రక్తహీనత ఉన్నవారు టమాటా సూప్‌ను తాగితే మంచిది. చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. దీంతో గుండె సమస్యలు రావు. హార్ట్ ఎటాక్ వంటివి రాకుండా చూసుకోవచ్చు.
4. ఎదిగే పిల్లలకు నిత్యం టమాటా సూప్‌ను ఇస్తే దాంతో రోజూ ఉత్తేజంగా ఉంటారు. చదువుల్లో రాణిస్తారు. మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. పొటాషియం ఎక్కువగా ఉన్నందు వల్ల నాడీ సంబంధ సమస్యలు పోతాయి. యాక్టివ్‌గా ఉంటారు.
5. టమాటా సూప్‌ను తాగడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఇది అధిక బరువు ఉన్న వారికి ఎంతగానో మేలు చేసే విషయం. అందువల్ల వారు రోజూ టమాటా సూప్‌ను తీసుకోవాలి.
6. లైకోపీన్, కెరోటినాయిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లు టమాటాల్లో ఉండడం వల్ల పలు రకాల క్యాన్సర్లు రావు. క్యాన్సర్ కణతులు కూడా వృద్ధి చెందవు. ప్రధానంగా వక్షోజ క్యాన్సర్, ప్రోస్టేట్, కోలన్ క్యాన్సర్ వంటివి ఉన్నవారు టమాటా సూప్‌ను తాగడం మంచిది.
7. రెండు వారాల పాటు టమాటా సూప్‌ను రోజూ తాగితే దాంతో మగవారిలో వీర్యం వృద్ధి అవుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. లైకోపీన్ వల్లే ఇది సాధ్యమవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. అందువల్ల పురుషులు శృంగార సామర్థ్యం పెరగాలంటే రోజూ ఒక కప్పు టమాటా సూప్‌ను తాగాల్సిందే.
8. టమాటాల్లో క్రోమియం ఎక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది. వారి రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. కనుక మధుమేహం ఉన్న వారు టమాటా సూప్‌ను రోజూ తాగడం మంచిది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి.