నిజమే… ఒకప్పటి కంటే ఇప్పుడు మనలో చాలా మందికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ బాగా పెరిగింది. అందులో భాగంగానే నిత్యం ఏదో ఒక విధంగా శారీరక శ్రమ చేస్తున్నారు. ఒంట్లో చేరిన అదనపు కొవ్వును, అధిక బరువును తగ్గించుకుంటున్నారు. అది సరే..! అంత వరకు బాగానే ఉంది. కానీ ఆహారం విషయానికి వచ్చే సరికి మాత్రం పప్పులో కాలేస్తున్నారు. అదేనండీ… ఈ మధ్య ఇన్‌స్టంట్ నూడుల్స్ మాదిరిగానే పలు ఇన్‌స్టంట్, ప్యాక్డ్ ఫుడ్స్ మనకు అందుబాటులోకి వచ్చాయి కదా..! వాటి గురించే మేం చెబుతోంది. నిజానికి అవి పైకి హెల్దీ అని డాక్టర్లు చెబుతున్నా… వాటి ద్వారా మనకు తెలుస్తున్న వాస్తవ విషయాలు మాత్రం వేరేగా ఉన్నాయి. అలాంటి ఇన్‌స్టంట్ ఫుడ్స్ తినడం ఏమాత్రం మంచిది కాదని, పైకి హెల్దీ అని ఉన్నా, వాటిని తింటే రోగాలకు తలుపులు తెరిచినట్టే అని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఈ క్రమంలో అలాంటి ఫుడ్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఇన్‌స్టంట్ ఓట్ మీల్… ఓట్స్… గుండెకు చాలా మంచివి. వైద్యులు చెప్పే మాట ఇది. అయితే వీటిని raw రూపంలో ఉన్నప్పుడే తినాలి. అంటే… వాటిని ప్రాసెస్ చేసి ఉండకూడదు. ముడి రూపంలో లభించే ఓట్స్ మాత్రమే తింటే దాంతో ముందు చెప్పిన విధంగా మంచి జరుగుతుంది. అదే ఇప్పుడు చాలా కంపెనీలు తీసుకొస్తున్నాయి కదా. ఇన్‌స్టంట్ ఓట్స్ రూపంలో… వాటిని మాత్రం తినకూడదు. అలా తింటే వాటిలో ఉండే చక్కెర, ఇతర కార్బొహైడ్రేట్లు గుండెకు చేటు చేస్తాయి. డయాబెటిస్ వంటి వ్యాధులను కలిగిస్తాయి. ఫ్లేవర్డ్ యోగర్ట్… యోగర్ట్ అంటే గడ్డ కట్టిన పెరుగే. దీన్ని అనేక ఫ్లేవర్ల రూపంలో మనకు అమ్ముతున్నారు. వాటిని తింటే వాటిలో ఉండే చక్కెర మన ఒంట్లోకి వెళ్తుంది. తద్వారా కొవ్వు అధికంగా చేరడమే కాదు, గుండె సంబంధ వ్యాధులు వస్తాయి. రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరిగి డయాబెటిస్ వంటి వ్యాధులు వస్తాయి.
ఎనర్జీ డ్రింక్స్… శక్తినిస్తాయి కదా అని చెప్పి ఎనర్జీ డ్రింక్స్ గానీ తాగుతున్నారా..? అయితే జాగ్రత్త..! ఎందుకంటే వాటితో శక్తి కాదు, వ్యాధులు వస్తాయి. వాటిలో ఉండే హై క్యాలరీ కంటెంట్ గుండె జబ్బులను తెచ్చి పెడుతుంది. కొవ్వును పెంచుతుంది. హోల్ వీట్ బ్రెడ్… గోధుమలతో చేసిన హోల్ వీట్ బ్రెడ్.. అని ఆరగించేస్తున్నారా..? దాంతో ఆరోగ్యం కలగదు. పైపెచ్చు రక్తంలో గ్లూకోజ్ పరిమాణం ఎడా పెడా పెరిగి డయాబెటిస్ వచ్చేలా చేస్తుంది జాగ్రత్త..! ప్యాక్డ్ కూల్ డ్రింక్స్… ఇవైతే ఇంకా డేంజర్. షుగర్ పదార్థం ఎక్కువగా ఉంటుంది. కనుక వీటిని పూర్తిగా మానేయాల్సిందే. లేదంటే డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
పాప్‌కార్న్ బాక్స్‌లు… పాప్ కార్న్ పెట్టి ఇచ్చే రంగు రంగుల పేపర్ బాక్సులు తెలుసు కదా..! వాటిలో పెట్టిన పాప్ కార్న్‌ను తినకూడదు. అలా తింటే విషపూరితమైన కెమికల్స్ మన శరీరంలోకి వెళ్తాయట. ఆ తరువాత జరిగేదేంటో అందరికీ తెలుసు కదా..! చెప్పలేని రోగాలు వస్తాయి. మన శరీరానికి మంచి ప్రోటీన్స్ లభిస్తాయి కదా అని ప్రోటీన్ బార్స్ తినేరు. అవి చాలా డేంజరట. వాటిని తింటే పెద్ద మొత్తంలో క్యాలరీలు శరీరంలో చేరతాయి. ఆ తరువాత బరువు పెరగడం, గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి వ్యాధులు వస్తాయి.