కొన్ని ప్రదేశాల్లో కొన్ని పనులు చెయ్యటం ఎంత ప్రమాదకరమో నా అనుభవం చెప్తాను. సౌత్ ఆఫ్రికా లో నాకు ఒక వ్యాపార భాగస్వామి వున్నాడు (అతను అక్కడ నల్ల జాతికి చెందిన వ్యక్తి) అతని కుటుంబం మొత్తం వేరే స్టేట్ లో (దాని పేరు లింపోపో ) వుంటారు తాను మాత్రం మేము వుండే స్టేట్ (గౌటెంగ్) లో ఉంటాడు. వాళ్ళ అమ్మ నాన్న (వాళ్ళ నాన్న గారు ఒక మీడియం సైజు పొలిటిషన్ వాళ్ళ ఏరియా లో ) నన్ను వాళ్ళ ఇంట్లో జరిగే ఫంక్షన్స్ కి రెగ్యులర్ గా పిలిచే వాళ్ళు.కానీ పని ఒత్తిడి వల్ల వెళ్లడం కుదిరేది కాదు. కానీ ఒకసారి ఈస్టర్ సెలెబ్రేషన్స్ కి నువ్వు రావాల్సిందే అన్నారు. నాకు స్వతహాగా కొత్త ప్రదేశాల్లో అన్నా, కొత్త కల్చర్స్ తెలుసుకోవడం అన్నా చాలా ఆసక్తి.
మొత్తానికి ఈస్టర్ ముందురోజు ఉదయం 5 గంటలకి బయదేరాం దూరం 400 కిలో మీటర్స్. నాతో పాటు ఇంకో ఇండియన్ ఫ్రెండ్ ని నా కార్ లో ఎక్కించుకున్న కంపెనీ కోసం మొత్తం ముగ్గురం. నా కార్ లోనే నేనే డ్రైవ్ చేస్తున్నా ఒక 300 కిలో మీటర్స్ వెళ్ళాక మా కుడిచేతి వైపు కొన్ని వేల కార్లు ఒక గ్రౌండ్ లో పార్క్ చేసి ఉండడం చూసి నా లోకల్ ఫ్రెండ్ ని అడిగాను అక్కడ ఏం జరుగుతుంది అని. ఆ గ్రౌండ్ లో జెడ్ సి సి అనే చర్చి వుంది అని ప్రతి ఈస్టర్ కి 60 లక్షల మంది అక్కడికి వొచ్చి ప్రేయర్ చేస్తారు అన్నాడు.
7 కోట్ల జనాభా వున్న సౌత్ ఆఫ్రికా లో 60 లక్షల మంది ఒక చోట చేరడం నిజంగా అద్భుతం అనిపించింది. కొంత దూరం వెళ్ళాక ఆ చర్చి బోర్డు కనిపిస్తుంది కుతూహలం ఆపుకోలేక కార్ ని రోడ్ పక్క పార్క్ చేసి రోడ్ కి అటువైపు వెళ్లి నేను ఫొటోస్ తియ్యడం మొదలెట్టా ఒకటి లేదా రెండు తో ఆపకుండా అన్ని విధాలుగా జూమ్ చెయ్యడం జనాల్ని, కార్స్ ని కవర్ చెయ్యడం చేస్తున్న. సడన్ గా నా ఫోన్ జూమ్ లో ఒక 200 లేదా 300 మంది మా వైపు పరిగెత్తుకువస్తున్నట్టు కనిపించింది. నేను ఫోన్ ఆపేసాను ఈలోపు ఒక 10 మంది సెక్యూరిటీ గార్డ్స్ చుట్టూ చేరారు వాళ్ళతో పాటు అక్కడికి వొచ్చిన వాళ్ళు కూడా చుట్టూ చేరుతున్నారు. కొంత మంది మేము ముగ్గురు శాతాన్ అని వీళ్ళని చంపెయ్యండి అంటున్నారు కొంత మంది ఫోన్స్ మరియు కార్ లాక్కోండి అంటున్నారు.
కొంత మంది వీళ్ళని లోపలికి తీసుకెళ్లి చీకటి గదిలో పెట్టండి అని ఇలా ఎవరిష్టం వాచినట్టు వాళ్లు అంటుంటే నేను నా ఫోన్ బయటికి తీసి ఫొటోస్ అన్నీ వాళ్ళ ముందు డిలీట్ చేసి ఇదిగో ఫోన్ లో ఏ ఫొటోస్ లేవు చుడండి చుడండి అని వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుని డిసైడ్ అయ్యే లోపు కార్ దగ్గరికి పరిగెత్తి డోర్స్ అన్నీ లాక్ చేసి 160 కిలో మీటర్ వేగంతో పారిపోయాం. ఆరోజు నేను సమయ స్ఫూర్తి తో అక్కడ నుంచి చక చకా కదిలి ఉండక పోతే మా ముగ్గురు జీవితాలు ఏమయ్యేవో తెలీదు. ఈ ఫోటో లో నా ఆఫ్రికన్ స్నేహితుడు వాళ్ళ అమ్మ నాన్న మరియు మా అప్పటి ఎంప్లాయిస్.