Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

ఎలాంటి ఆప‌ద‌లు ఉన్నా ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే విజ‌యం మీ సొంత‌మ‌వుతుంది..!

Admin by Admin
March 28, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఒక్కో దేవాలయం ఒక్కో ప్రత్యేకత. సాధారణంగా దేవాలయాలు తూర్పు అభిముఖంగా ఉంటాయి. తూర్పుద్వారం గుండాలోనికి వెళ్లి స్వామిని దర్శించుకుంటారు. అయితే ఈ దేవాలయంలో పశ్చిమాభికంగా ఉన్న గోపురం గుండా లోనికి వెళ్లి స్వామిని దర్శించుకోవాలి. దీనివల్ల ఈ దేవాలయం దర్శించినవారికి విజయప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తున్నారు. ఆ దేవాలయ విశేషాలు తెలుసుకుందాం. తెలుగువారి ఇష్టదైవాలలో నరసింహస్వామి ఒకరు. దేశంలో మరే ప్రాంతానికీ తీసిపోని విధంగా తెలుగు నేల మీద అద్భుతమైన నరసింహ క్షేత్రాలు ఉన్నాయి. అటువంటి వాటిలో సింహాచల నరసింహ క్షేత్రం ప్రముఖమైనది. విశాఖపట్నానికి దగ్గరలోని తూర్పుకనుమల్లో భాగమైన పర్వతమే సింహాచలం. ఆ కొండమీద వెలసిన దైవమే వరాహ లక్ష్మీ నరసింహస్వామి.

ఈ ఆలయంలోని మూలవిరాట్టుని సాక్షాత్తూ ఆ ప్రహ్లాదుడే ప్రత్రిష్టించాడని చెబుతారు. రాక్షస సోదరులైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులని చంపిన వరాహ, నరసింహ అవతారాల కలయికగా ఇక్కడి విగ్రహం కనిపిస్తుంది. వరాహ ముఖంతో, మనిషి శరీరంతో, సింహం తోకతో స్వామి ఉంటారు. ఒకప్పుడు ప్రహ్లాదుని పాలనలో పూజలందుకున్న ఈ ఆలయం క్రమేపీ శిథిలావస్థకు చేరుకుందనీ.. స్వామి మీద పుట్టలు వెలిశాయని స్థల పురాణం చెబుతోంది. ఒకనాడు పురూరవుడనే మహారాజు ఈ ప్రాంతం గుండా వెళ్తుండగా ఇక్కడ పుట్టల కింద స్వామివారు ఉన్నట్లు ఆయనకు స్వప్నంలో తెలిసిందట. దాంతో సహస్ర కళశాలతో పుట్టని తడిపి స్వామి వారి రూపం బయటపడేట్లు చేశారట. ఈ సంఘటన అక్షయ తృతీయ రోజున సంభవించింది. ఉగ్రమూర్తి అయిన స్వామివారి రూపాన్ని భక్తులు తట్టుకోలేరు కనుక నిత్యం వారిని చందనంతో కప్పివేయమని పురూరవుడు ఆజ్ఞాపించారని చెబుతారు.

visit simhachalam temple if you have any problems

అప్పటి నుంచి ప్రతి అక్షయ తృతీయ సందర్భంగా పాత చందనాన్ని తొలగించి 12 గంటలపాటు స్వామివారి నిజరూపం దర్శనానికి అవకాశమిస్తారు. ఆపై స్వామివారిని సహస్ర కళశాలతో అభిషేకించి తిరిగి చందనాన్ని లేపనం చేస్తారు. నిజరూప దర్శనం సమయంలో స్వామివారి విగ్రహం త్రిభంగి భంగిమలో కనిపిస్తుంది. నిటారుగా నిల్చొని, నడుము దగ్గర ఒక పక్కకు ఒంగి, తిరిగి మెడను నిటారుగా ఉంచడమే త్రిభంగి భంగిమ. చందనోత్సవం సందర్భంగానే కాకుండా… ఏడాది పొడవునా ఈ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఉవ్విళ్లూరుతుంటారు. అందుకు కారణాలు చాలానే కనిపిస్తాయి. సంపెంగ పూలతోనూ, పనసచెట్లతోనూ నిండిన సింహాచలం కొండ మీదకు అడుగుపెట్టగానే దివ్యమైన అనుభూతి కలుగుతుందన్నది భక్తుల భావన.

తిరుమల కొండల మీద ఉన్నట్లు సింహాచలం మీద కూడా అనేక జలధారలు కనిపిస్తాయి. వాటిలో గంగధార, ఆకాశధార, మాధవధార, చక్రధార ప్రముఖమైనవి. ఈ ధారలలో స్నానం చేసి భక్తులు ఆలయానికి చేరుకుంటారు. పశ్చిమముఖంగా ఉన్న గాలిగోపురం ద్వారా గుడిలోకి ప్రవేశించడం మరో చిత్రం. సాధారణంగా మనం చూసే గుళ్లన్నీ తూర్పుముఖంగా కనిపిస్తాయి. కానీ సింహాచలం దీనికి మినహాయింపు. ఇలా పశ్చిమాభిముఖంగా ఉండే ఆలయాన్ని దర్శిస్తే విజయం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ గర్భగుడికి ఎదురుగా కనిపించే స్తంభాన్ని కప్పస్తంభం అంటారు. స్వామివారికి భక్తులు తమ కప్పాలను (ముడుపులు) చెల్లించుకుంటారు కాబట్టి ఆ పేరు వచ్చి ఉండవచ్చు. ఆ కప్ప స్తంభం కింద సంతానగోపాలస్వామి యంత్రం ఉందని అంటారు. అందుకే ఈ స్తంభాన్ని కౌగలించుకున్నవారికి తప్పకుండా సంతానం లభిస్తుందట. ఆలయం గోపురం మాత్రమే కాదు… అలయంలో అడుగడుగునా కూడా ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో అరుదైన శిల్పాలు కనువిందు చేస్తాయి.

స్వామివారి అనుగ్రహ మహిమో, వారి మీద ఉండే చందనం మహిమో కానీ గర్భగుడిలోకి ప్రవేశించగానే మండు వేసవిలో సైతం ఒళ్లు చల్లబడిపోతుందని చెబుతారు. గర్భగుడిలోని స్వామి చుట్టూ ప్రదక్షిణాలు చేసే అవకాశం ఉండటం ఇక్కడ మరో ప్రత్యేకత. కొండ మీద వెలసిన స్వామి చుట్టూనే కాదు… ఆ కొండ చుట్టూతా ప్రదక్షిణం చేసే అవకాశం ఉండటం మరో విశేషం. తమిళనాట తిరువణ్ణామలై కొండ చుట్టూ ప్రదక్షిణ చేసినట్లుగా, సింహాచలానికి కూడా గిరిప్రదక్షిణ చేసే విషయం చాలామందికి తెలియదు. ఏటా ఆషాఢ శుద్ధ చతుర్దశి రోజు వేలాదిమంది భక్తులు 32 కిలోమీటర్ల చుట్టుకొలత ఉండే సింహాచలం కొండని చుట్టి, స్వామిని చేరుకుంటారు. ఆయనను తల్చుకుంటే చాలు, తమ ఆపదలు తీరిపోతాయని వారి విశ్వాసం. అలా ఆపదలు తీర్చే దైవం కాబ‌ట్టే ఆయనను అప్పన్న అని పిల్చుకుంటారట.

Tags: simhachalam temple
Previous Post

బిళ్వ వృక్షానికి పూజ‌లు చేస్తే స‌క‌ల పాపాలు పోతాయి.. ఎంతో పుణ్యం ల‌భిస్తుంది..!

Next Post

రాజ‌కీయ నాయ‌కులు త‌ర‌చూ ద‌ర్శించే ఆల‌యం ఇది.. ఒక్క‌సారి ద‌ర్శిస్తే అప‌జ‌యం అన్న‌ది ఉండ‌దు..

Related Posts

Off Beat

ఏప్రిల్ 1వ తేదీన ఫూల్స్ డే అని ఎందుకు అంటారో తెలుసా..? వెనకున్న ఆసక్తికర విషయం ఇదే..!

July 21, 2025
vastu

బెడ్‌రూమ్‌లో ఈ వాస్తు చిట్కాల‌ను పాటిస్తే.. దంప‌తుల మ‌ధ్య అస‌లు గొడ‌వ‌లే ఉండ‌వు..

July 21, 2025
information

రైలు కడ్డీలు ఎందుకు అడ్డంగానే ఉంటాయి ? దానికి కారణం ఏంటి ? ?

July 21, 2025
ఆధ్యాత్మికం

న‌ర దిష్టి, న‌ర‌ఘోష త‌గ‌ల‌కుండా ఉండాలంటే.. ఈ చిన్న ప‌ని చేయండి చాలు..!

July 21, 2025
పోష‌ణ‌

రోజూ స్ట్రాబెర్రీల‌ను తింటే క‌లిగే అద్బుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

July 21, 2025
హెల్త్ టిప్స్

ఇన్సులిన్ తీసుకుంటున్నారా..? అయితే ఈ పొర‌పాట్ల‌ను చేయకండి..!

July 21, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.