Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

అలనాటి అందాల తార హీరోయిన్ దివ్య భారతి మరణానికి, ఆ సినిమాకి ఉన్న సంబంధం ఏంటంటే ?

Admin by Admin
May 13, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

అతిపిన్న వయసులోనే అసాధారణ గుర్తింపు పొంది స్టార్ హీరోయిన్ అనిపించుకున్న అలనాటి అందాల తార దివ్యభారతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 19 ఏళ్ల వయసులోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి అభిమానులకి తీరని శోకాన్ని మిగిల్చింది ఈ అందాల తార. శ్రీదేవి బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత తెలుగు తెరమీద మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ అనిపించుకున్న తార దివ్యభారతి. సరిగ్గా మూడు దశాబ్దాల క్రితం జరిగిన ఈమె మరణం నేటికి మిస్టరీనే! 1974 ఫిబ్రవరి 25వ తేదీన మహారాష్ట్రలో జన్మించింది దివ్య భారతి. విక్టరీ వెంకటేష్ బొబ్బిలి రాజా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.

సీరియస్ పాత్రలలోనూ ఎక్స్పోజ్ చేయడంలో దివ్యభారతి పెట్టింది పేరు. అయితే 19 ఏళ్ల వయసులోనే ఆమె హఠాత్తుగా మరణించింది. ఈ మరణానికి ఒక సినిమాకు మధ్య లింకు ఉందా? అంటే ఉందనేవారు.. లేదనే వారు కూడా ఉన్నారు. అదే.. చింతామణి..! దివ్యభారతికి యూత్ లో ఉన్న ఫాలోయింగ్ గమనించిన దర్శకరత్న దాసరి నారాయణ రావు దివ్యభారతితో ఒక సినిమాను ప్లాన్ చేయాలని భావించారు. చింతామణి చాలా పాపులర్ నాటకం అన్న సంగతి తెలిసిందే. గతంలో రంగస్థలం మీద వేలాది ప్రదర్శనలు ఇచ్చిన నాటకం. చింతామణి పాత్ర గురించి విన్న దివ్యభారతి అందులో నటించాలని ముచ్చటపడింది.

divya bharati died before doing that movie

1992లో ఈ మూవీ షూటింగ్ కూడా మొదలైంది. అయితే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావలసి ఉంది. ఈ నేపథ్యంలో డేట్ల సర్దుబాటు ప్రక్రియలో దివ్యభారతి మునిగిపోయింది. కానీ రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలుకాకముందే దివ్యభారతి అకస్మాత్తుగా మరణించింది. దీంతో ఆ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది.

ఆ తర్వాత ఈ సినిమాను మరొకరితో అయినా తీయాలని దాసరి పై ఒత్తిడి పెరిగింది. కానీ దానికి దాసరి ఒప్పుకోలేదు. దివ్యభారతి మనసు పెట్టుకున్న సినిమా అని, దీనిని తీయాలనుకుంటే ఆమెతోనే అని పక్కన పెట్టేశారు. నిర్మాత సాజిద్ నడియావాలాతో ప్రేమ, పెళ్లి.. ఆ వెంటనే మరణం.. అన్నీ కూడా తన కెరీర్ ఎంత స్పీడ్ గా పెరిగిపోయిందో అంతే స్పీడ్ గా కింద‌కు ప‌డింది.

Tags: Divya Bharati
Previous Post

అల్లు అరవింద్ రెండవ కొడుకు అలా చనిపోయాడా.. షాకింగ్ విషయాలు రివీల్ చేసిన అల్లు శిరీష్!

Next Post

సంఖ్య శాస్త్రం ప్రకారం ఈ నెలలో వివాహం చేసుకున్న వారి జీవితం మొత్తం అదృష్టమయమే !

Related Posts

lifestyle

తొడ‌లు లావుగా ఉన్న‌వారు ఇలాంటి దుస్తుల‌ను ధ‌రిస్తే మంచిది..!

June 3, 2025
హెల్త్ టిప్స్

పాదాల వాపులు ఉన్నాయా.. అయితే ఇలా చేయండి చాలు..

June 3, 2025
వైద్య విజ్ఞానం

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే అది డీహైడ్రేష‌న్ అన్న‌మాటే.. ఇలా చేస్తే చాలు..!

June 3, 2025
mythology

మంగ‌ళ సూత్రాల‌కు పిన్నీసుల‌ను ఎందుకు పెట్ట‌కూడ‌దు..?

June 2, 2025
ఆధ్యాత్మికం

చిన్న వ‌య‌స్సులోనే పిల్ల‌లు చ‌నిపోతే.. అందుకు కార‌ణం ఎవ‌రు..?

June 2, 2025
ఆధ్యాత్మికం

పూజ చేసిన త‌రువాత క‌ర్పూరం ఎందుకు వెలిగిస్తారు..? దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే..!

June 2, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!