Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

ఈ 5 లక్షణాలున్న అబ్బాయిలను అమ్మాయిలు బాగా ఇష్టపడతారట! అవేంటంటే..?

Admin by Admin
June 12, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

జీవితంలో ప్రతి విషయాన్ని పంచుకునేందుకు ఒక తోడు కావాలి. అది బాధను చెప్పుకోవడానికైనా, ఆనందాన్ని పంచుకోవడానికైనా, కష్టాల్లో తోడుగా ఉండడానికైనా.. ఇలా చాలామందికి అలాంటి తోడు లేకనే లైఫ్ లో విజయాన్ని సాధించలేకపోతున్నారు. అలా జీవితంలో ఒక భాగస్వామి కావాలనే కోరిక ఉన్నా ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలో తెలియక, పెళ్లి చూపులకు వెళితే అమ్మాయిని ఎలా మెప్పించాలో అర్థం కాక ఎన్నో అవకాశాలను చేజార్చుకుంటున్నారు. అబ్బాయిలు ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు వెంటనే ప్రపోజ్ చేయాలనుకుంటారు. కానీ అమ్మాయిలు అలా కాదు. వారికంటూ కొన్ని అభిప్రాయాలు, ఇష్టా ఇష్టాలు ఉంటాయి. అమ్మాయిలు అబ్బాయిల అందం కంటే వారి అలవాట్లను ఎక్కువగా గమనిస్తారు. అయితే అబ్బాయిలు ఎలా ఉంటే అమ్మాయిలకు నచ్చుతారో చెప్పలేని పరిస్థితి. కొందరు అబ్బాయిలు జులాయిగా ఉన్న అమ్మాయిలకు నచ్చేస్తారు. కొందరు పద్ధతిగా రాముడిలా కనిపించినా నచ్చరు. అయితే అమ్మాయిలు అంతా కోరుకునే జనరల్ లక్షణాలు ఒక 5 ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అమ్మాయిలు ఇష్టపడాలంటే మీరు తెలివైన వారై ఉండాలి. అమ్మాయిలు ఎక్కువగా తెలివైనవాడు కావాలని కోరుకుంటారు. వారు ఇష్టపడే అబ్బాయి మరి దద్దిగా ఉంటే వాళ్లకు నచ్చదు. కాస్త తెలివైనవాడు అయి ఉండాలని కోరుకుంటారు. పరిస్థితులను చక్కదిద్దగల వ్యక్తి అవ్వాలని ఆశపడుతూ ఉంటారు. అమ్మాయిలు ఇష్టపడే వాటిలో కాన్ఫిడెన్స్, హైట్, పర్సనాలిటీ, అందం వీటి గురించి పక్కన పెడితే.. ఏ సందర్భం అయినా, ఎలాంటి కష్టమైన పరిస్థితి అయినా మీరు ఎదుర్కొనగలరనే నమ్మకం వారికి కలగాలి. మీరు ఒక ధైర్యవంతులని, మీతో ఉంటే వారికి ఎలాంటి భయం ఉండదని నమ్మకాన్ని వారికి కలిగించాలి. అలాంటి అబ్బాయిని అమ్మాయిలు త్వరగా ఇష్టపడతారు.

women love this kind of men very much

అబ్బాయి సమయస్ఫూర్తిగా ఉండి అమ్మాయిల్ని అప్రోచ్ అయితే వాళ్లు దాదాపు 90% ఆ అబ్బాయికి పడే ఛాన్స్ ఉందని ఇప్పటికే ఎన్నో సర్వేల్లో తేలింది. ఏ అమ్మాయికి అయినా అబ్బాయి ఎప్పుడూ కోపంగా, ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉంటే నచ్చదు. అబ్బాయి అనే వాడు కాస్త జోవియల్ గా ఉండాలి. అప్పుడప్పుడు పంచులు వేస్తూ ఎదుటివారిని నవ్వించాలి. అతనితో ఉంటే టైం తెలియదు అని వాళ్ళు ఫీల్ అయ్యేలా చేయాలి. నవ్వించే అబ్బాయికి అమ్మాయిలు త్వరగా కనెక్ట్ అవుతారు. ఏ లక్షణం ఉన్న లేకపోయినా ఈ లక్షణం మాత్రం తప్పకుండా ఉండాలి. అమ్మాయిలు అబద్ధాలు చెప్పే వ్యక్తులను ఎప్పుడూ ఇష్టపడరు. అంతేకాదు వారికి చాలా దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే నిజాయితీగా ఉండాలి. ఎవరితోనైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా ఉన్నది ఉన్నట్లు మాట్లాడగలగాలి. మీరు తప్పు చేసిన దానిని నిజాయితీగా ఒప్పుకోవాలి. నిజాయితీగా ఉండే అబ్బాయిలని అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు.

స్త్రీలు, అమ్మాయిలు వారికంటూ సముచిత స్థానాన్ని, ఒక గౌరవాన్ని కోరుకుంటారు. ప్రతి విషయంలో వారికి అవకాశం కల్పించడం, వారి అభిప్రాయాలను వినడం, వారికి కూడా మాట్లాడే అవకాశాన్ని కల్పించాలి. వారిని వారిలా గౌరవించే అబ్బాయిలను అమ్మాయిలు బాగా ఇష్టపడతారు.

Tags: menwomen
Previous Post

షుగ‌ర్ ఉన్న‌వారు ఇలా చేయాల్సిందే.. లేదంటే గుండె జ‌బ్బులు వ‌స్తాయి..

Next Post

మీరు టాయిలెట్ లో ఫోన్ వాడుతున్నారా.. అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..!

Related Posts

వైద్య విజ్ఞానం

మూర్ఛ రోగి చేతిలో ఇనుప తాళాలు పెడితే ఫిట్స్ ఆగుతాయా..?

June 14, 2025
lifestyle

రాత్రి 3 గంటల సమయంలో నిజంగానే దెయ్యాలు తిరుగుతాయా? ఆ స‌మ‌యాన్ని డెవిల్స్ అవర్ అని ఎందుకు అంటారు.?

June 14, 2025
Off Beat

చీమ‌లు నిద్ర‌పోతాయా..? వాటికి నిద్ర వ‌స్తుందా..? నిద్ర వ‌స్తే ఎలా నిద్రిస్తాయి..? తెలుసా..?

June 14, 2025
చిట్కాలు

మీ ముఖం అందంగా మారాలంటే ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను ట్రై చేయండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పర్ఫ్యూమ్ ల‌ను అతిగా ఉప‌యోగిస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

June 14, 2025
హెల్త్ టిప్స్

అతిగా ఆలోచిస్తున్నారా.. అయితే దీన్నుంచి ఎలా బ‌య‌ట ప‌డాలో తెలుసుకోండి..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!