Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వైద్య విజ్ఞానం

మూర్ఛ రోగి చేతిలో ఇనుప తాళాలు పెడితే ఫిట్స్ ఆగుతాయా..?

Admin by Admin
June 14, 2025
in వైద్య విజ్ఞానం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మూర్ఛ వ్యాధి… చిన్నా, పెద్దా… ఆడ, మ‌గ తేడా లేకుండా ఈ వ్యాధి వ‌స్తుంది. ఇది రావ‌డానికి కార‌ణాలు ఏమున్నా మూర్ఛ వ‌చ్చి ఫిట్స్‌తో కొట్టుకుంటుంటే మాత్రం అప్పుడు ఆ వ్య‌క్తి నోట్లో నుంచి నుర‌గ వ‌స్తుంది. అన్ని సంద‌ర్భాల్లోనూ ఇలా ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ నుర‌గ వ‌చ్చిందంటే మూర్ఛ రోగ‌మ‌నే అనుమానించాలి. అలాంటి సంద‌ర్భాల్లో కొంద‌రు అప‌స్మార‌క స్థితిలోకి కూడా వెళ్తారు. అయితే అలా మూర్ఛ వ‌చ్చిన వ్య‌క్తుల చేతిలో మ‌న పూర్వీకులు ఇనుముతో చేసిన తాళాలు లేదంటే ఐర‌న్ రాడ్‌ల‌ను పెట్ట‌డం చేస్తారు. దీంతో మూర్ఛ ఆగుతుంద‌ని వారి భావ‌న‌. అయితే ఇందులో నిజ‌మెంత‌..? నిజంగా అలా ఇనుప తాళాలు, రాడ్‌ల‌ను పెడితే మూర్ఛ ఆగుతుందా..? ఫిట్స్ ఆగిపోతాయా..? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

మూర్ఛ వ‌చ్చిన‌ప్పుడు ఆ వ్యక్తుల చేతిలో ఇనుప తాళాలు, రాడ్ల‌ను పెట్ట‌డంపై చాలా మంది వైద్యులు ఏం చెబుతున్నారంటే… అది ఎంత మాత్రం ప్ర‌భావం చూపింద‌ట‌. మూర్ఛ‌ను ఆపే శ‌క్తి ఇనుప తాళాలు, రాడ్ల‌కు, ఇత‌ర ఇనుప వ‌స్తుల‌కు ఉండ‌ద‌ట‌. అయితే ఎప్పుడు, ఎవ‌రికి మూర్ఛ వ‌చ్చినా అది 2 నుంచి 5 నిమిషాల లోపే ఉంటుంది. ఆ లోపు వారంత‌ట వారే సాధార‌ణ స్థితికి వ‌చ్చేస్తార‌ట‌. ఈ క్ర‌మంలో వారి చేతిలో ఇనుప తాళాలు, రాడ్ల‌ను పెట్టినా, పెట్ట‌కున్నా ఫ‌లితం ఉండ‌ద‌ని, అయితే అలా పెట్టినా, ఎలాగూ కొంత సేప‌టికి సాధార‌ణ స్థితికి చేరుకుంటారు కనుక‌, చాలా మంది ఇనుప వ‌స్తువులు ప‌నిచేశాయ‌ని భావిస్తారు. కానీ ఇందులో ఎంత మాత్రం నిజం లేదంటున్నారు న్యూరో స‌ర్జ‌న్ నిపుణులు.

fits disease will it stop if we put iron items in their hands

అయితే మూర్ఛ వ‌చ్చిన‌ప్పుడు అలాంటి వ్య‌క్తుల ప‌ట్ల కొన్ని జాగ్ర‌త్త‌లు మాత్రం క‌చ్చితంగా తీసుకోవాల‌ని వైద్యులు చెబుతున్నారు. అవేమిటంటే… మూర్ఛ వ‌చ్చిన రోగిని నేల‌పై పడుకోబెట్టాలి. ఫిట్స్‌తో కొట్టుకుంటూ అటు ఇటు బాగా వేగంగా క‌దిలినా, క‌ద‌ల‌నివ్వాలి. కానీ వారి చ‌ర్య‌ల‌ను ఆప‌కూడ‌దు. ఒక వేళ ఆపితే వారికి స‌డెన్ అటాక్ వ‌చ్చేందుకు అవకాశం ఉంటుంద‌ట‌. అదేవిధంగా మూర్ఛ వ‌చ్చిన రోగి నోట్లో ఎలాంటి వ‌స్తువుల‌ను పెట్ట‌కూడదు. వాంతికి అయితే చేసుకోనివ్వాలి. త‌గినంత గాలి ఆడేలా చూడాలి. వెంట‌నే వైద్యుని వ‌ద్ద‌కు తీసుకెళ్లాలి.

Tags: fitsiron keys
Previous Post

రాత్రి 3 గంటల సమయంలో నిజంగానే దెయ్యాలు తిరుగుతాయా? ఆ స‌మ‌యాన్ని డెవిల్స్ అవర్ అని ఎందుకు అంటారు.?

Next Post

రోజూ ఒక పూట మాత్ర‌మే సంతృప్తిక‌రంగా భోజ‌నం చేయండి.. ఎందుకంటే..?

Related Posts

lifestyle

కొరియన్స్ అందరూ సన్న గా ఉంటారెందుకు? వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది?

June 15, 2025
చిట్కాలు

మీ తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారాలంటే పాటించాల్సిన స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..

June 15, 2025
చిట్కాలు

పొడిగా ఉండే మీ చ‌ర్మం మృదువుగా మారాలంటే ఈ చిట్కాలను పాటించండి..

June 15, 2025
హెల్త్ టిప్స్

ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!

June 15, 2025
business

ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడానికి ముఖేష్ అంబానీ, ఎలాన్ మస్క్ ఎందుకు గట్టిగా పోట్లాడుతున్నారు..?

June 15, 2025
వినోదం

సినిమాల్లో ఆర్టిస్టులు వాడిన దుస్తులను ఏమి చేస్తారు?

June 15, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.