Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home mythology

పాండ‌వులు ద్రౌప‌దిని పెళ్లి చేసుకోవ‌డం వెనుక ఉన్న అస‌లు క‌థ ఇదా..?

Admin by Admin
June 21, 2025
in mythology, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మహాభారతంలో ద్రౌపదికి అయిదుగురు భర్తలున్నరనే విషయం తెలిసినదే. అయితే, ద్రౌపదికి అయిదుగురు భర్తలు ఉండటం వెనుక అసలు కారణం మీకు తెలుసా? అయితే, ఈ ఆర్టికల్ చదవండి. మహాభారతం మొత్తం పాండవులు, కౌరవుల చుట్టూనే తిరుగుతుంది. ఈ ఎపిక్ లో మహాభారత యుద్ధం ముగిసే వరకు వివిధ సంఘటనలన్నీ పాండవులు, కౌరవులపైనే కేంద్రీకరించబడి ఉన్నాయి. మహాభారత యుద్ధంలో పాల్గొని గెలుపొందిన, ఓడిన పురాణ పురుషులపైనే మహాభారత ఇతిహాసం పరిభ్రమిస్తుంది. అసలు ఈ యుద్ధానికి ప్రధాన కారణమైన ఓ మహిళ. ఆ మహిళ వల్లే మహాభారత యుద్ధం జరిగిందని నానుడి. అవునండి, మనం ద్రౌపది గురించే మాట్లాడుకుంటున్నాం. ఈ ఇతిహాసంలో ద్రౌపదిది చాలా శక్తివంతమైన పాత్ర. పాంచాల రాజ్య యువరాణి ద్రౌపది. పాండవుల ధర్మపత్ని. చాలా తెలివితేటలు, అణుకువ కలిగిన ద్రౌపది భర్తలపై అపారమైన గౌరవ మర్యాదలు కలిగినది.

ద్రౌపది గురించి విషయాలన్నీ అసక్తికరమైనవే. ఆమె అపారమైన సౌందర్యం, ఆమె దర్జా, ఆమె భక్తి ప్రపత్తులు, ఆమె ప్రేమ, ఆమె అవమానం, ఆమె ప్రతిజ్ఞ వీటికి సంబంధించి మహాభారతంలో చెప్పబడిన కథలన్నీ అబ్బురపరుస్తాయి. అన్నదమ్ములైన అయిదుగురుకి భార్యగా ఉండవలసిన పరిస్థితి ఎదురైన‌ మహిళల ఆలోచనా స్థితి ఎలా ఉంటుందో ఉహించగలరా? కాని, ఇక్కడ ద్రౌపది విషయంలో అయితే మునుపటి జన్మ వరం కారణంగా ఆమె అయిదుగురు భర్తలకు భార్యగా ఉండవలసి వచ్చింది. ద్రౌపదికి అయిదుగురు భర్తలు పొందడానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. మహాశివుడి వరం గత జన్మలో ద్రౌపది ఒక మునికి జన్మించింది. ఆమెకు వివాహం జరగడం లేదని తీవ్రంగా దుఃఖించింది. ఆమెకు ఎంతకూ వివాహం కాకపోవడంతో జీవితంపై నిరాశ చెంది మహాశివుడి కోసమై తపస్సు ప్రారంభించింది. దీర్ఘకాల తపస్సు తరువాత మహా శివుడు ఆమె తపస్సుకు మెచ్చి దర్శనమిచ్చి ఒక వరాన్ని ప్రసాదించాడు.

do you know the real story of draupadi

ఆమె అయిదు లక్షణాలు కలిగిన వరుడిని భర్తగా ప్రసాదించమని మహాశివుడిని వేడుకుంది. తనకు కాబోయే భర్తకు అయిదు లక్షణాలు ఉండాలని ద్రౌపది వేడుకుంది. నీతి, ధైర్య సాహసాలు, అందమైన, విజ్ఞానం కలిగిన, అమితమైన ప్రేమ కురిపిస్తూ దయా హృదయం కలిగిన వ్యక్తిని భర్తగా ప్రసాదించమని కోరుకుంది. ఆమె కోరిక విన్న మహాశివుడు ఒక్క క్షణం అలోచించి ఈ అయిదు లక్షణాలు కలిగిన వరుడు దొరకడం కష్టమని భావించాడు. అందువల్ల ఆమె మరుజన్మలో విడివిడిగా ఈ అయిదు లక్షణాలు కలిగిన అయిదుగురు పురుషులు ఆమెకు భర్తగా లభిస్తారని వరమిచ్చాడు. అందువల్ల ద్రుపద రాజుకు ద్రౌపది జన్మించినప్పుడే ఆమెకు అయిదుగురు భర్తలుంటారని అప్పటికే విధి నిర్ణయించింది. పురాణాలలో అప్పట్లో బహు భార్యత్వం, బహు భర్తృత్వం అనే ఆచారాలున్నట్లు చెప్పబడింది. ఈ అంశాన్నిమనం విస్మరించకూడదు. భారత్ లోని ఉత్తర-పశ్చిమ ప్రాంతాలలోని అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉన్నచోట ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి.

ఇప్పటికీ ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా వంటి ప్రాంతాల్లో అమ్మాయిల సంఖ్య అబ్బాయిల సంఖ్యతో పోలిస్తే చాలా తక్కువ. పురాణాలలో చెప్పబడే హస్తినాపురమనే ప్రదేశం ఈ ప్రాంతాలకు దగ్గరగానే ఉండేది. అందువల్ల, ద్రౌపది అయిదుగురు భర్తలను కలిగి ఉండడానికి గల కారణాలలో అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉండేదన్న అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. స్వయంవరంలోని ద్రౌపదిని గెలుచుకుని ఇంటికి వచ్చిన అర్జునుడు తన తల్లి వద్దకు వచ్చి అమ్మా, చూడు నేనేం తెచ్చానో అనంటాడు. కుంతీ దేవి ఏదో ఆలోచిస్తూ అర్జునుడు దేని గురించి చెప్తున్నాడో చూడకుండా ఎం తెచ్చినా అన్నదమ్ములతో పంచుకోమని ఆదేశిస్తుంది. అలా తల్లి మాటకు విలువిస్తూ అయిదుగురు అన్నదమ్ములు ద్రౌపదిని వివాహమాడతారు. మహాభారత యుద్ధాన్ని ఐకమత్యంతో ఎదుర్కొనమని కుంతీ దేవి తన పుత్రులకు సలహా ఇచ్చిందనే భావించవచ్చు. త్వరలో యుద్ధం రాబోతుందన్న విషయం కుంతీకి తెలిసే ఉండుంటుంది. ద్రౌపాది అపార సౌందర్యం అన్నదమ్ముల వల్ల కలహాలను సృష్టిస్తుదని కుంతీ భావించి ఉండవచ్చు. అందరూ ద్రౌపదిపై ఆశపడ్డారన్న విషయాన్ని కుంతీ గ్రహించి ఈ విధమైన సలహా ఇచ్చి ఉంటుందని అంటారు. వ్యూహాత్మకంగా కుంతీ ఆదేశం వల్ల అన్నదమ్ములు ఐకమత్యంతోనే కలిసున్నారు.

Tags: draupadi
Previous Post

హిందూ ఆల‌యాల విష‌యంలో ఇంత‌టి సైన్స్ దాగి ఉందా..?

Next Post

సూర్యాస్త‌మ‌యం అయిన త‌రువాత మ‌హిళ‌లు జుట్టును ముడి వేయాలి.. జుట్టును దువ్వ‌కూడ‌దు.. ఎందుకంటే..?

Related Posts

vastu

మీ ఇంట్లో అద్దాన్ని ఏ పక్కన పెడితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసా..?

July 30, 2025
హెల్త్ టిప్స్

వెన్ను నొప్పితో బాధపడుతున్నారా..అయితే ఈ ఫుడ్ తినాల్సిందే..

July 30, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఫోన్ అతిగా వాడుతున్నారా.. చాలా పెద్ద ప్రమాదం..!!

July 29, 2025
ఆధ్యాత్మికం

గురువారం రోజు ఈ వస్తువులు బీరువాలో పెడితే ధనలక్ష్మి మీవెంటే..!!

July 29, 2025
వినోదం

4 రోజుల్లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు మూవీకి వ‌చ్చిన క‌లెక్ష‌న్లు ఇవే.. బ్రేక్ ఈవెన్ రావాలంటే ఇంకా ఎంత వ‌సూలు చేయాలంటే..?

July 29, 2025
ఆధ్యాత్మికం

పురాత‌న కాలంలో రుషులు పాదుక‌ల‌ను ధ‌రించ‌డానికి వెనుక ఉన్న కార‌ణాలు ఇవే..!

July 29, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
డ్రింక్స్‌

Oats Chocolate Milk Shake : బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు క్ష‌ణాల్లో దీన్ని చేసుకుని తాగండి.. త‌క్ష‌ణ‌మే శ‌క్తి ల‌భిస్తుంది..

by D
October 29, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.